Ambati Rambabu: ఇంధన ధరలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం.. రిక్షా తొక్కి నిరసన తెలిపిన మాజీ మంత్రి అంబటి
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్సార్‌సీపీ గుంటూరులో భారీ ఆందోళన చేపట్టింది.
Ambati Rambabu: ఇంధన ధరలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం.. రిక్షా తొక్కి నిరసన తెలిపిన మాజీ మంత్రి అంబటి
Ambati Rambabu: గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. కూటిమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఇదేనా సంపద సృష్టి, ఇదేనా సుపరిపాలన అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో రాష్ట్ర పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్.. ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కమీషన్లు వచ్చే పనులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదని.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.




