YSRCP: చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్!
YSRCP: చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
YSRCP: చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్!
YSRCP: స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయం ఒక్కసారిగా తీవ్ర వేడెక్కింది. పోరు హోరాహోరీగా సాగుతుందనుకున్న తరుణంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వైసీపీ తరఫున మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిచి నామినేషన్ దాఖలు చేసిన షేక్ కరీమూన్ అనూహ్యంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పోటీలో ఉన్న ముఖ్యమైన అభ్యర్థే చివరి నిమిషంలో పార్టీ మారడంతో చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల రేసు తీవ్ర ఆసక్తికరంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో షేక్ కరీమూన్ అధికారికంగా టీడీపీలో చేరారు. ఆమెకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించిన ప్రత్తిపాటి పుల్లారావు, కరీమూన్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యతతో పాటు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కరీమూన్ చేరికతో చిలకలూరిపేటలో టీడీపీ మరింత బలోపేతమైంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఇక తథ్యమని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరఫున రేసులో నిలిచి అధికారికంగా నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసిన షేక్ కరీమూన్, ఆ మరుసటి పరిణామాల్లో ఉన్నపళంగా టీడీపీ గూటికి చేరడం ప్రత్యర్థి వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఊహించని పరిణామంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మున్సిపల్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంటామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రధాన అభ్యర్థి చేయిదాటిపోవడంతో వైసీపీ క్యాంప్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది.




