Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు.. గుంటూరులో ఎఫ్‌ఐఆర్!

Ambati Rambabu: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోషల్ మీడియాలో ఏఐ వీడియోలతో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో మరో కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 3:40 PM IST
Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు.. గుంటూరులో ఎఫ్‌ఐఆర్!
X

వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు.. గుంటూరులో ఎఫ్‌ఐఆర్!

Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చట్టపరమైన చిక్కులు మరింత ఎక్కువవుతున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై గుంటూరులోని అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా, ప్రజల్లో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో సృష్టించిన వీడియోలను పోస్ట్ చేశారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అంబటి రాంబాబుపై BNS సెక్షన్లు 356, 353, 352, 61(2), 3(5) కింద కేసు నమోదు చేశారు.

ఇదే వ్యవహారంలో ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరి సీఐడీ (CID) కార్యాలయంలో ఇప్పటికే ఒక కేసు నమోదైంది. సీఐడీ కేసుతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదు కావడంతో ఏపీ రాజకీయంలో తీవ్ర కలకలం రేగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story