Chintoor: చింతూరు ఎంపీటీసీ-1 లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోడే కళ్యాణి ప్రచార హోరు!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఎంపీటీసీ-1 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోడే కళ్యాణి తరఫున సుధాకర్ (చిన్ని), జిక్రియా, శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఇంటింటి ప్రచారం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 30 Oct 2026 7:44 AM IST
Chintoor
X

Chintoor: చింతూరు ఎంపీటీసీ-1 లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోడే కళ్యాణి ప్రచార హోరు!

Chintoor: చింతూరు ఎంపీటీసీ -1 ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోడే కళ్యాణి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.వైసీపీ సీనియర్ నాయకులు సుధాకర్ (చిన్ని) , జిక్రియా, మహిళా నాయకురాలు శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చింతూరు ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరించారు.

స్థానికంగా సమస్యల పరిష్కారానికి సోడే కళ్యాణి లాంటి సమర్థురాలిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, పెద్దలను కలిసి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని నేతలు తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR