Nandyal: మీడియా ముసుగులో నీచమైన భాషా? ఆర్కేపై మండిపడ్డ ఆదిశేషయ్య!
Nandyal: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nandyal: మీడియా ముసుగులో నీచమైన భాషా? ఆర్కేపై మండిపడ్డ ఆదిశేషయ్య!
ఆత్మకూరు: మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తలించుకునేలా ఏబీయన్ రాధాకృష్ణ ప్రసారం చేసిన వార్తలతో ఆ ఛానెల్ ఆంధ్రా బ్రోతల్ నెట్ వర్క్ లా తయారైందని, ఇలాంటి వారు మీడియాలో ఉండి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని, మఖ్యంగా పార్టీ నాయకుల భార్యలైన నీఛ నికృష్ణమైన బాషతో దూషించిన వైనాన్ని నిరసిస్తూ, ఏబియన్ రాధాకృష్ణపైన, ప్రచారం చేసిన వ్యక్తులందరిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఆత్మకూరు పోలిస్ స్టేషన్ లో ఎస్సై జిలానికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చారని, మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ మేమంతా మావిగన్ కు సపోర్ట్ చేస్తే వైఎస్సార్సీపీ నాయకులను కించపరుస్తూ ఏబీయన్ రాధాకృష్ణ కొత్తపలు కార్యక్రమంలో సంస్కారహీనంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నామన్నారు.
ఏబీయన్ రాధాకృష్ణపై మేము మాట్లాడుతుంటే అదేదో తప్పన్నట్లుగా సీయం, డిప్యూటి సీయంలు ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియచేస్తున్నారని, అయితే తమ పార్టీ నాయకుల రాసలీలలు ప్రతి 15 రోజులకొకసారి బయటకు వస్తున్నాయని, వాటిపై కూడా స్పందించాలన్నారు. అలా కాకుండా పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారికి డప్పు కొట్టే ఏబీయన్ కు సంపూర్ణ మద్దతును తెలుపుతూ ఇలా చేయడం సరికాదన్నారు.అమరావతి నిర్మాణం చేసేందుకు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్న నాయకులు అంత నగదు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలని, ఇది ప్రజలపై భారం కాదా అని, మా నాయకుడు సూచించినట్లుగా అభివృద్దిలో ఉన్న ప్రాంతాన్ని రాజధానిని చేస్తే 10 శాతం ఖర్చుతో రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందుతుందనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని, దానిని ఏదో తప్పు చేసినట్లుగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేసి మరీ ఇలా వికృత కార్యక్రమాలతో ప్రజలను డైవర్షన్ చేసేలా చూస్తున్నారని, ఇది సమర్దించదగ్గ విషయం కాదన్నారు.
మహిళలను కించపరిచిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని, మహిళాభివృద్దికి పెట్టపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఏమి సమాధానం చెబుతారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాధాకృష్ణకు మద్దతు తెలపడం దారుణమని, ఇదే పంథాలో కొనసాగితే ఆంధ్రరాష్ట్రంలో మహిళా లోకమంతా ఏబీయన్ ఛానెల్ ను బ్యాన్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కల్పనా రెడ్డి, కొండా చిన వెంకటేశ్వర్లు, బాలచెన్నయ్య, రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్, మాజీ సర్పంచ్ బొలిగర్ల వెంకటేశ్వర్లు, మైనారిటి నాయకులు షేక్ రహీం, షేక్ ఖజామస్తాన్, ఖాజావళి, యస్థాన్, అన్సర్, శ్రీనివాస్ యాదవ్, మల్లెంకొండయ్య, మధు, ప్రసాద్, వై పెంచలయ్య, కెపి వెంకటేష్, గులాం రసూల్, విష్ణు, బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.


