VR Puram: వి.ఆర్.పురంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బంధం విజయలక్ష్మి జోరుగా ప్రచారం!
VR Puram: పోలవరం జిల్లా వి.ఆర్.పురంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బంధం విజయలక్ష్మి ఎన్నికల ప్రచార హోరు. గ్రామగ్రామాన ప్రజల బ్రహ్మరథం, విజయంపై ధీమా వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు.
VR Puram: వి.ఆర్.పురంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బంధం విజయలక్ష్మి జోరుగా ప్రచారం!
VR Puram: వి.ఆర్.పురం మండలంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం హోరెత్తుతోంది.జడ్పీటీసీ అభ్యర్థి బంధం విజయలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు.ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రతి గ్రామంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు.
జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పాలనను గుర్తుచేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా బంధం విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలను పరిష్కరించి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు.పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల స్పందన చూస్తుంటే విజయం తమదేనని వైఎస్ఆర్సీపీ నేతలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




