రాశిఫలాలు - ప్రదోష వ్రతం రోజున ఈ రాశివారికి అన్నింటా విజయమే

ప్రదోషవ్రతం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరించడం జరిగింది. గ్రహస్థితులను బట్టి రాశిఫలితాలు ఇలా ఉన్నాయి.

Balachander
Published on: 29 April 2026 8:01 AM IST
రాశిఫలాలు - ప్రదోష వ్రతం రోజున ఈ రాశివారికి అన్నింటా విజయమే
X

April 29 2026 Horoscope: వైశాఖ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథిని "ప్రదోష వ్రతం" అని కూడా పిలుస్తారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున హస్త నక్షత్రం తోడవ్వడం విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హస్త నక్షత్రం అంటేనే 'చేతిలో విజయం' అని అర్థం. అంటే మనం తలపెట్టిన పనులను స్వయంగా పూర్తి చేసుకోగల శక్తిని ఈ నక్షత్రం ఇస్తుంది. కాగా ఈరోజు మనం చేసే దైవ ప్రార్థనలు కేవలం మనశ్శాంతినే కాకుండా...గ్రహ దోషాలను హరించి కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈరోజు ఏ రాశివారు ఎలా ఉండాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. 'ధైర్యే సాహసే లక్ష్మీ' అన్నట్లుగా, మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. సమయస్ఫూర్తి మీకు శ్రీరామరక్ష. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించి విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు గడిస్తారు. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. పనులు కాస్త ఆలస్యమైనా, పట్టుదలతో పూర్తి చేస్తారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించడం అత్యంత శ్రేష్టం.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. ఈరోజు ఈరాశివారు లక్ష్మీదేవిని ఆరాధించాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. కాస్త నిలకడగా ఉండాల్సిన సమయం. గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకండి. మౌనం పాటించడం వల్ల అనేక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక నియంత్రణ అవసరం. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయడం ఉత్తమం.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు ఈరాశివారు హనుమాన్‌ చాలీసా పఠించడం ఉత్తమం.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. గ్రహ గతులు అద్భుతంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో తిరుగుండదు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. వృత్తిపరంగా అనేక అవకాశాలు వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వ్యాపారంలో భారీ లాభాలుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు దుర్గాదేవిని దర్శించుకోవాలి.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆదాయం సామాన్యంగా ఉన్నా, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి పరంగా కొంత ఇబ్బందులు ఎదురౌతాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ది హనుమను ఆరాధించాలి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఓర్పుతో ఉంటే సాయంత్రం లోపు మంచి ఫలితం కనిపిస్తుంది. ఈరోజు ఈరాశివారు గణపతిని ఆరాధించడం శుభకరం.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. దైవ దర్శనం వల్ల మానసిక ఊరట లభిస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. కళాకారులకు, స్వయం ఉపాధి చేసేవారికి ఈ రోజు అదృష్టం తలుపు తడుతుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉంటే అన్నీ విజయాలే. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవాలి.

గమనికః ఇక్కడ ఇచ్చినవి సాధారణ రాశిఫలితాలు మాత్రమే. వ్యక్తిగత, పూర్తిస్థాయి ఫలితాలు కావాలంటే ప్రత్యేక జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story