Astrology: త్వ‌ర‌లో విష యోగం.. ఈ రాశుల వారు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత మంచిది

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. తాజాగా అలాంటి ఓ విశేష యోగం ఏర్పడనుంది.

Mokshith
Published on: 8 July 2026 4:22 PM IST
Astrology
X

Astrology: త్వ‌ర‌లో విష యోగం.. ఈ రాశుల వారు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత మంచిది

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. తాజాగా అలాంటి ఓ విశేష యోగం ఏర్పడనుంది. దాని పేరే విష యోగం.. ఇంతకీ ఏంటీ విషయోగం దీనివల్ల ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ‌రాశి వారు ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి

సింహ రాశి వారికి ఫ్యామిలీప‌రంగా అంతా బాగానే ఉన్నా.. ఆర్థిక విషయాల్లో మాత్రం ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంది. అనుకోని ఖ‌ర్చులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి డ‌బ్బు విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మిథున రాశి వారు నిర్ణయాల్లో జాగ్ర‌త్త‌

మిథున రాశి వారికి కూడా ఇది క‌ష్ట కాలంగా చెబుతున్నారు. కుటంబ‌ప‌ర‌మైన కొన్ని విష‌యాలు ఆందోళ‌న క‌లిగించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా డ‌బ్బుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పండితులు సూచిస్తున్నారు. కొత్త‌గా చేసే ఇన్వెస్ట్‌మెంట్లు, కీల‌క ఇప్పందాల విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.

కన్యా రాశి వారికి పనుల్లో ఆలస్యం

ఈ రాశి వారికి కొన్ని ప‌నులు ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అనుకున్న స‌మ‌యానికి పూర్తికాక‌పోవ‌డం లేదా ప‌నులు మ‌ధ్య‌లోనే ఆగిపోయే అవ‌కాశాలు ఉన్నాయి. కాబ‌ట్టి ఓర్పుతో, చేసే ప్ర‌తీ ప‌నిని ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి చేయ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు.

ధనస్సు రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

ఈ రాశి వారు ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ స‌మ‌యంలో అప్పు ఇవ్వ‌డం లేదా తీసుకోవ‌డం వంటివి చేయ‌కూడ‌ద‌ని అంటున్నారు. వీలైనంత వ‌ర‌కు దూర ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోవ‌డం మంచిది. అన‌వ‌స‌ర ఇబ్బందులు త‌గ్గించుకోవాలంటే ప్ర‌తీ నిర్ణ‌యాన్ని ఆలోచించి తీసుకోవాలి.

గమనిక: పైన తెలిపిన విష‌యాలు ప‌లువురు జ్యోతిష్య పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story