Horoscope: బ్రహ్మయోగంతో అదృష్టానికి మించిన ఫలితాలను పొందే రాశులు ఇవే
బ్రహ్మయోగంతో భారీగా మారనున్న రాశుల జాతకాలు. ఊహించని ఆ అద్భుతమైన ఫలితాలు ఏంటో తెలుసుకుందాం.
Horoscope: అధిక జ్యేష్టమాసం కృష్ణపక్షం పంచమి తిథితో పాటు ఈరోజు శ్రీవేంకటేశ్వరుని నక్షత్రమైన శ్రవణం ఉండటం, పైగా ఈరోజు శుక్రవారంతో కూడిన బ్రహ్మయోగం కావడంతో పలు రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు చోటు చేసుకుంటాయి. పైకి చూసేందుకు సామాన్యంగానే కనిపించినా...జీవితంలో కలిగే మార్పులను ఊహించలేరు. మరి ఈ బ్రహ్మయోగం ద్వాదశ రాశుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందామా.
మేషరాశి
ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల వీలైనంత వరకు శ్రద్ధ వహించాలి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలోనూ అశ్రద్ధ వహించరాదు. శ్రీమహాలక్ష్మిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
గతంలో మీ నుంచి తీసుకున్న ధనం తిరిగి మీ చేతికి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో ధైర్యం వహించాలి. కీలక విషయాలపై పెద్దలతో చర్చిస్తారు. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
మిథునరాశి
ఈరోజు చేపట్టిన పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి. భయపడవలసిన అవసరం లేదు. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచనలతోనే సాద్యమైనంత వరకు రోజును ముందుకు తీసుకెళ్లాలి. సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కార్యసిద్ధి హనుమాన్ ఆరాధనతో అద్భుతాలు చోటు చేసుకుంటాయి.
కర్కాటకరాశి
ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. నూతన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. సమయాన్ని వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. అష్టలక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది.
సింహరాశి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యార్ధులకు అనుకూలమైన రోజు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గురు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వలన ఏకాగ్రత పెరుగుతుంది.
కన్యారాశి
ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడికి తగ్గట్టుగా పనిచేయవలసి వస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు. సిద్ది వినాయకుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. వీలైనంత వరకు సాత్వికాహారం తీసుకునేందుకు ప్రయత్నించండి.
తులారాశి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులనుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యుడి ఆలయాలను సందర్శించాలి.
వృశ్చికరాశి
చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగం పరంగా శ్రమ పెరుగుతుంది. శ్రీవేంకటేశ్వ స్వామిని దర్శించుకోవడం శుభకరం.
ధనూరాశి
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కీలకమైన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావొచ్చు. ప్రేమికుల మధ్య అవగాహన కలుగుతుంది. బంధం మరింతగా బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
మకరరాశి
వ్యాపారంలో అనుకోని లాభాలు ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పదిమందికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. శ్రీ లక్ష్మీకుబేర మంత్రాన్ని పఠిస్తూ లక్ష్మీదేవికి అష్టోత్తం చేయడం మంచిది.
కుంభరాశి
ఈరోజు మానసికంగా ప్రశాంతంగా బలంగా కనిపిస్తారు. జీవితానికి అవసరమైన నిర్ణయాలను తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం నెలకొంటుంది. భవిష్యత్ కోసం ఓ సంకల్పం తీసుకుంటారు. కాలభైరవుడిని ఆరాధించడం వలన మానసికంగా దృఢత్వం లభిస్తుంది.
మీనరాశి
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. శ్రమతో కూడిన పనులను చేపడతారు. వ్యాపారంలోనూ చీకాకులు ఎదురౌతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులతో ముందుకు అడుగులు వేస్తారు. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉంటారు.
గమనికః ఇక్కడ ఇచ్చినవి సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తి వ్యక్తిగత జాతక ఫలితాలు కావాలంటే జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలి.




