Daily Horoscope : శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ రాశుల అదృష్టం మామూలుగా లేదుగా..!
ఈరోజు ఏప్రిల్ 10, 2026. మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభం సూచిస్తుండగా, కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
Daily Horoscope and Predictions for April 10, 2026
Today Rasi Phalalu: శుక్రవారం(ఏప్రిల్ 10, 2026) నాటి ద్వాదశ రాశి ఫలాలు. మేషం నుండి మీనం వరకు మీ రాశి ఫలం ఎలా ఉందో , మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం.
మేషం
పనుల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
వృషభం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మిథునం
వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. అనవసర ప్రయాణాల వల్ల కొంత అలసట, ఆందోళన కలగవచ్చు.
కర్కాటకం
ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. మాట తీరుపై నియంత్రణ ఉండాలి.
సింహం
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
కన్య
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పాత బాకీలు తీరిపోతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
తుల
ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూల సమయం. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ధనలాభం ఉంటుంది.
వృశ్చికం
ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆకస్మిక లాభాలు కలిగే అవకాశం ఉంది.
ధనుస్సు
సృజనాత్మక రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మకరం
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం మంచిది. ఖర్చులు అదుపులో ఉంచాలి.
కుంభం
తలచిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. తోబుట్టువుల నుండి సహకారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం
బంధు మిత్రుల సహాయం అందుతుంది. వృత్తిలో రాణిస్తారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది.
గమనిక: ఇవి సాధారణ ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.


