Daily Horoscope: రాశిఫలాలు- మేషంలో మూడు గ్రహాల కలయిక… మీ రాశిపై ప్రభావం ఎలా?

Daily Horoscope: ఈ శనివారం జ్యోతిష్య పరంగా ప్రత్యేకమైన రోజు. చంద్రుడు మేష రాశిలో సంచరిస్తుండగా అశ్విని నక్షత్ర ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది.

Balachander
Published on: 18 April 2026 8:05 AM IST
Daily Horoscope
X

Daily Horoscope: రాశిఫలాలు- మేషంలో మూడు గ్రహాల కలయిక… మీ రాశిపై ప్రభావం ఎలా?

Daily Horoscope: ఈ శనివారం జ్యోతిష్య పరంగా ప్రత్యేకమైన రోజు. చంద్రుడు మేష రాశిలో సంచరిస్తుండగా అశ్విని నక్షత్ర ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ముఖ్యంగా మీన రాశిలో కుజుడు, బుధుడు, శని గ్రహాల కలయికతో ఏర్పడిన త్రిగ్రాహి యోగం, అలాగే మేషంలో సూర్యుడు...చంద్రుడు...శుక్రుడు కలయిక విశేష ఫలితాలను ఇస్తుంది. అనఫా, వాశి యోగాలు కూడా కలిసివచ్చి కొన్ని రాశులకు మంచి అభివృద్ధి సూచిస్తున్నాయి. ఈ అద్భుతమైన ఖగోళ మార్పుల వల్ల 12 రాశుల వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో క్లుప్తంగా, స్పష్టంగా ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి: రాజకీయ రంగానికి చెందిన వారికి ఈరోజు తిరుగుండదు. ప్రజల్లో మీ గౌరవం అమాంతం పెరుగుతుంది. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా 90% లాభదాయకత కనిపిస్తోంది.

వృషభం: కొంత జాగ్రత్త అవసరం. పనులు ఆలస్యమవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి.

మిథున రాశి: వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు దక్కుతాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. శని దేవుని ఆరాధన మీకు రక్షగా నిలుస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం.

కర్కాటక రాశి: మీ చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయం ఆసన్నమైంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. 'హనుమాన్ చాలీసా' పఠించడం వల్ల మరిన్ని విజయాలు వస్తాయి.

సింహ రాశి: మీరు తలపెట్టిన పనులకు ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు అవసరం.

కన్యారాశి: ఈ రాశి వారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం.

తులారాశి: ఈ రాశి వారికి వైవాహిక బంధం బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

వృశ్చిక రాశి: ఈరాశివారికి ఈరోజు అనూకూలంగా ఉంది. కష్టానికి ఫలితం. పెట్టుబడుల్లో నిపుణుల సలహా మంచిది. విదేశీ వ్యవహారాల్లో కీలక మలుపు కనిపిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు.

ధనస్సురాశి: ఈరోజు ఈరాశివారికి కొంత అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్ర గ్రహ ప్రభావంతో అనుకోని లాభాలు వస్తాయి. అయితే, ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ సులభంగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి.

కుంభరాశి: ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు రావొచ్చు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

మీనరాశి: ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఒడిదుడుకులకు గురికావలసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story