Daily Horoscope 2 April 2026: ఈ రాశుల వారికి అద్బుత రాజయోగం

Daily Horoscope 2 April 2026: ఈ రోజు గ్రహ సంచారం ప్రకారం 12 రాశుల వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

Naresh.k
Published on: 2 April 2026 8:34 AM IST
Daily Horoscope 2 April 2026: Financial Gains for These Zodiac Signs
X

Daily Horoscope 2 April 2026

Daily Horoscope: నేడు 02 ఏప్రిల్ 2026, గురువారం. ఆధ్యాత్మికంగా ఈ రోజు చైత్ర పౌర్ణమి ,కొన్ని ప్రాంతాల్లో హనుమజ్జయంతిగా జరుపుకుంటున్నారు. ఈ రోజు గ్రహ సంచారం ప్రకారం 12 రాశుల వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

మేషం:

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. అయితే, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది.

వృషభం:

వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. మీడియా మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం:

గృహ లేదా వాహన సంబంధిత పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురుకావచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. అధికారులతో వాదనలకు దిగకండి.

కర్కాటకం:

ధైర్యంతో చేపట్టిన పనులు సఫలమవుతాయి. సోదరుల నుండి పూర్తి సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహం:

కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

కన్య:

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

తుల:

అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

వృశ్చికం:

ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. స్నేహితుల సహాయంతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం.

ధనుస్సు:

వృత్తిరీత్యా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

మకరం:

అదృష్టం వరిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు.

కుంభం:

అష్టమ చంద్రుని ప్రభావం వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చు. కోపాన్ని తగ్గించుకోవడం శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు.

మీనం:

భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

గమనిక: ఇవి కేవలం గ్రహ స్థితిగతుల ఆధారంగా చెప్పబడిన సామాన్య ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక చక్రం మరియు దశల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.

Naresh.k

Naresh.k

Next Story