Daily Horoscope రాశిఫలాలు - ఈ రాశులవారు దైవబలంతో విజయం సాధిస్తారు

Daily Horoscope: ఈరోజు కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంటే, మరికొన్ని రాశువారు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది.

Balachander
Published on: 23 April 2026 7:44 AM IST
Daily Horoscope
X

Daily Horoscope రాశిఫలాలు - ఈ రాశులవారు దైవబలంతో విజయం సాధిస్తారు

Daily Horoscope: ఈరోజు కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంటే, మరికొన్ని రాశువారు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మేషం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్దతో పనిచేయాలి. ఇక ఈరోజు వైశాఖమాసం శుక్లపక్ష సప్తమీ తిథి, పునర్వసు నక్షత్రం కారణంగా ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో 12 రాశులపై తిథి, నక్షత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది, 12 రాశుల వారి జాతక ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏకాగ్రతను కోల్పోకూడదు. మధ్యాహ్నం తరువాత ధనలాభం సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. నవగ్రహ శ్లోకాలను పఠించడం మంచిది.

వృషభరాశి

ఈరోజు ఈరాశి వారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక వ్యాపారంలో లాభాలు వస్తాయి. భిన్నంగా ఆతోచించే మనస్తత్వం కారణంగా సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు శ్రీమహాలక్ష్మిని ధ్యానించడం ఉత్తమం.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయం. నిర్ణయాలు తీసుకునే సమయంలో తడబడకుండా ఉండాలి. ఆలోచించి చేసే పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు చేసే ఖర్చుల కారణంగా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు వినాయకుడిని ఆలయాన్ని సందర్శించాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేపట్టినా దానికి తగ్గ శ్రమ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. వీలైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మంచిది.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా కొంత ముందుకు సాగుతుంది. అయితే పూర్తికావడానికి అవసరమైన శ్రమతో పాటు తెలివిని కూడా ఉపయోగించాలి. ఈరోజు మీకు దైవం సహకరిస్తుంది. కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు ఆంజనేయుడికి ఆకుపూజ చేయించడం మంచిది.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈరాశివారు కులదేవతను ఆరాధించాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకాగలవు. ధైర్యంతో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. సహనంతో విజయాలు సాధిస్తారు. వివాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. ఈరోజు ఈరాశివారు నరసింహస్వామిని ఆరాధించాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ వ్యవహారశైలి బయటపడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయడం మంచిది.

ధనుస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేపట్టినా సంపూర్ణంగా పూర్తి చేస్తారు. దైవబలం మీకు తోడుగా ఉంటుంది. లాభాలను ఆర్జిస్తారు. ప్రమోషన్లు పొందుతారు. ఆర్థికంగా బలంగా తయారవుతారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఈరోజు ఈరాశివారు ఆదిశంకరాచార్య కనకధార స్త్రోత్రం పఠించడం మంచిది.

మకర రాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. పనిలో శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా ఫర్వాలేదు. మీరు తీసుకున్న నిర్ణయాలు సమాజంపై కొంత ప్రభావం చూపుతాయి. కుటుంబంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు ప్రత్యక్షదైవం సూర్యనారాయణుడిని ఆరాధించాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. సమయస్పూర్తితో ఓ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు శ్రీ మహావిష్ణువు సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఏపని మొదలుపెట్టినా ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమైన పనులను వాయిదా వేయకూడదు. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈరోజు మీరు ఓ చెడు వార్తను వినాల్సి ఉంటుంది. కుటుంబంలో అపోహలు ఎదురుకావొచ్చు. ఈరోజు ఈరాశివారు మహాశివుడిని పంచామృతం అభిషేకం చేయడం మంచిది.

గమనికః ఇవి కేవలం సాధారణ రాశిఫలాలు మాత్రమే. వ్యక్తిగతంగా వారి నక్షత్ర, గ్రహ స్థితిగతులను అనుసరించి జాతక ఫలితాలు మారవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story