Daily Horoscope: రాశిఫలాలు - సూర్యారాధనతో ఈరాశులవారికి కలిసి వస్తుంది
Daily Horoscope: ఏప్రిల్ 26, 2026 ఆదివారం వైశాఖమాసం శుక్లపక్ష దశమి తిథి. మఖ నక్షత్రం కలయికతో కూడిన విశిష్టమైన రోజు.
Daily Horoscope: రాశిఫలాలు - సూర్యారాధనతో ఈరాశులవారికి కలిసి వస్తుంది
Daily Horoscope: ఏప్రిల్ 26, 2026 ఆదివారం వైశాఖమాసం శుక్లపక్ష దశమి తిథి. మఖ నక్షత్రం కలయికతో కూడిన విశిష్టమైన రోజు. ఈరోజు సూర్యుడిని అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు గ్రహస్థితిగతులు, నక్షత్రాల స్థితిని బట్టి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో, ఎవరి జాతకం ఎలా ఉన్నదో, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముందు చూపుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. కృషికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకాలం వలన ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఓ మంచి వార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన పనులను ప్రారంభిస్తారు. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ లేదా ప్రయోషన్లు వచ్చే అవకాశం ఉంది. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇక ఈరోజు ఈరాశివారు మహాశివుడిని ఆరాధించడం మంచిది.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సహనం, ఓర్పుతో, శక్తిమేరకు కృషి చేయడం వలన విజయం లభించవచ్చు. కుటుంబంలో అనవసరపు వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. పూర్వికుల ఆస్తికి సంబంధించిన లాబాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈరోజు ఈరాశివారు సూర్యాష్టకాన్ని పఠించాలి.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రయోషన్లు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అయితే, వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టపవనాలు వీస్తున్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం ఉత్తమం.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో కొంత మేరకు విజయం సాధిస్తారు. సమయపాలన అవసరం. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఈరోజు ఈరాశివారు హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని ఖర్చులు, సవాళ్లు ఎదురౌతాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తెలివితో సమస్యలను ఎదుర్కోవాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు శనిదేవుని ఆరాధన శ్రేయస్కరం.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో పరిష్కారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు దుర్గాదేవిని ఆరాధించాలి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు ఈరాశివారు శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించాలి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. శతృవులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలాన్ని ఇస్తాయి. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయడం మంచిది.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలాలు సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని, గ్రహస్థితులను బట్టి వారి జాతక ఫలితాలు మారుతుంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది.




