Daily Horoscope: ఈ 5 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు..!

Daily Horoscope: ఏప్రిల్ 06, 2026 నాటి ద్వాదశ రాశి ఫలాలు, పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Naresh.k
Published on: 6 April 2026 7:34 AM IST
Daily Horoscope
X

Daily Horoscope: ఈ 5 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు..!

Today Rasi Phalalu: ఏప్రిల్ 06, 2026 నాటి ద్వాదశ రాశి ఫలాలు ,పంచాంగం. మీ రాశికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మేషం

పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. అనవసర ధనవ్యయం, ప్రయాణాలు సూచిస్తున్నాయి.

వృషభం

కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. మిత్రుల సహకారం అందుతుంది. గృహంలో ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది.

మిథునం

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల స్థితి ఉంటుంది. విద్యార్థులకు శుభకాలం.

కర్కాటకం

ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు రావచ్చు.

సింహం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్య

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ, వాహన యోగాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు.

తుల

బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో తొందరపాటు పనికిరాదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది.

వృశ్చికం

వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. భూ, గృహ యోగాలు సూచిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు

ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో స్వల్ప చికాకులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మకరం

నూతన ఉద్యోగ యోగం ఉంది. కీలక చర్చలు సఫలమవుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమాచారం అందుతుంది.

కుంభం

దూరపు బంధువులను కలుస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మీనం

శ్రమాధిక్యం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది.

గమనిక: ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష్య శాస్త్రం మరియు గ్రహ సంచారం ఆధారంగా ఇవ్వబడినవి. వ్యక్తిగత జాతక వివరాల కోసం పండితులను సంప్రదించగలరు.

Naresh.k

Naresh.k

Next Story