Daily Astrology: రాశిఫలాలు - ఈరాశులకు రాజయోగం...పట్టిందల్లా బంగారమే

జూన్ 26, 2026 శుక్రవారం, ద్వాదశి తిథి, విశాఖ నక్షత్రం, సిద్ధ యోగం ప్రభావంతో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, కుటుంబం, వ్యాపారం, ఆధ్యాత్మిక ఫలితాల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 26 Jun 2026 7:46 AM IST
Daily Astrology: రాశిఫలాలు - ఈరాశులకు రాజయోగం...పట్టిందల్లా బంగారమే
X

Daily Astrology: ఈ రోజు గ్రహస్థితులు అనేక రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలను సూచిస్తున్నాయి. కొందరికి ఉద్యోగంలో పురోగతి కనిపిస్తే, మరికొందరికి ఆర్థిక లాభాలు, కుటుంబ ఆనందం, ఆరోగ్య మెరుగుదల వంటి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ప్రతి రాశివారు తమ మాటల్లో సంయమనం పాటిస్తూ, దైవస్మరణతో రోజును ప్రారంభిస్తే మరింత శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

మేషరాశి

ఈరోజు మీకు అన్ని వైపుల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యంగా స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం మీ విజయానికి బలంగా నిలుస్తుంది. వివాహ ప్రయత్నాలు వేగం అందుకునే సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. అయితే, నేనే గొప్ప అనే దృక్పధాన్ని విడిచిపెట్టాలి. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారు కొన్ని శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో వృద్ది కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉత్సాహంతో పనులు మొదలుపెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కటుంబంలో మీ విలువ పెరుగుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి అనుకూలంగా ఉంది. పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకోని విధంగా లాభాలు ఉంటాయి.

కన్యారాశి

ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. అదనపు ఆదాయానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయావకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు.

తులారాశి

కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. సహనంతో వ్యవహరించడం మంచిది.

వృశ్చికరాశి

చేపట్టిన పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయం చేతికి అందుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవనశైలిలో కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలాన్నిస్తుంది.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారు ఎదుగుదల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది. కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. రాజకీయరంగంలోని వారికి ఈరోజు కలిసి వస్తుంది.

మకరరాశి

ఈరోజు ఈరాశివారు ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ ఆశయాలే మీ విజయానికి కారణమౌతాయి. పలువురి ప్రశంసలు అందుకుంటారు. మిత్రులతో కలిసి నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని బాధించే వారికి దూరంగా ఉండాలి. కార్యాలయంలో సహోద్యోగులతో వీలైనంత వరకు సౌమ్యంగా వ్యవహరించాలి. మీ అవసరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. కెరీర్‌పై మీరు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు.

మీనరాశి

మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రుణభారం తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తి జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story