Daily Horoscope: రాశిఫలాలు - మూడు మార్పులు...ముప్పై లాభాలు
శనివారం త్రయోదశి ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాశుల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి. పలు రకాలైన లాభాలను అందుకుంటారు.
Daily Horoscope: జూన్ 27, శనివారం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య పరంగా విశేష ప్రాధాన్యం కలిగిన రోజు. ఈరోజు నిజ జ్యేష్ట మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి రాత్రి 12:43 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం చతుర్దశి ప్రారంభమవుతుంది. అనూరాధ నక్షత్రం రాత్రి 10:11 గంటల వరకు, తర్వాత జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. సాధ్య యోగం మధ్యాహ్నం 12:32 వరకు, అనంతరం శుభ యోగం ప్రారంభమవుతుంది. కౌలవ కరణం ఉదయం 11:32 వరకు, తరువాత తైతిల కరణం కొనసాగుతుంది. ఈ తిథులు, గ్రహాల ప్రభావంతో కొన్ని రాశులకు పలు విషయాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మరి ఈ శనివారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రోజు మేష రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు మీకు మంచి గుర్తింపును తెస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ప్రయాణాలు విజయవంతంగా సాగుతాయి. శ్రీమహావిష్ణువును ప్రార్థించడం వలన శుభఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఈరాశివారు ఎరుపురంగు దుస్తులు ధరించాలి.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ రోజు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కులదేవతారాధన చేయడం వలన మేలు జరుగుతుంది. ఈరోజు ఈరాశివారు తెలుపురంగు దుస్తులు ధరించాలి.
మిథునరాశి
మిథున రాశి వారికి గౌరవం, గుర్తింపు పెరిగే రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ ప్రతిభకు అధికారులు ప్రశంసలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం. ఈరోజు ఈరాశివారు ఆకుపచ్చరంగు దుస్తులు ధరించాలి.
కర్కాటకరాశి
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు పూర్తి చేసినా పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. బంధువులతో మాటల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం. ఈరోజు ఈరాశివారు వెండి రంగు దుస్తులు ధరించాలి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఈరోజు ఈరాశివారు గోధుమరంగు దుస్తులు ధరించాలి.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఊహించని విధంగా విజయాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కుటుంబం నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు ఈరాశివారు లేత పసుపు రంగు దుస్తులు ధరించాలి.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తారు. ఈరోజు ఈరాశివారు క్రీమ్ కలర్ దుస్తులు ధరించాలి.
వృశ్చికరాశి
ఈ రోజు ధైర్యంతో వ్యవహరిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్త మనసుకు ఆనందం కలిగిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం శుభకరం. ఈరోజు ఈరాశివారు నీలం రంగు దుస్తులు ధరించాలి.
ధనుస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఖర్చులూ పెరుగుతాయి. బంధువులతో కలహాలు చోటు చేసుకుంటారు. మౌనమే అన్నింటికీ సమాధానంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ఈరాశివారు కాషాయం రంగు దుస్తులు ధరించాలి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వాణిజ్యరంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పాత బకాయిలను వసూలు చేసుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. ఈరోజు ఈరాశివారు నారింజ రంగు దుస్తులు ధరించాలి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఆశయాలకు కార్యరూపం ఇస్తారు. మీలో దాగిన ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు బంగారు వర్ణపు దుస్తులు ధరించాలి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ప్రతిభకు తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. దేవాలయాలను సందర్శించాలి. శ్రమ అనుకోకుండా పనిచేస్తారు. సమాజంలో గుర్తింపును అందుకుంటారు. ఈరోజు ఈరాశివారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.




