Daily Horoscope: ఈరోజు ఈరాశులకు రాజ్యయోగం ... ప్రతిపనిలోనూ విజయం
గ్రహాల గమనం, తిథి యోగాల ప్రభావం వలన ఈరోజు ఏ రాశివారికి అదృష్టం వరిస్తుందో, ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Daily Horoscope: ఈరోజు ఏకాదశి తిథి ఉదయం 6.21 వరకు ఉంటుంది. ఆ తరువాత ద్వాదశి తిథి ప్రారంభమౌతుంది. హస్త ఉదయం 5.56 వరకు ఉండి ఆ తరువాత చిత్త నక్షత్రం ప్రవేశిస్తుంది. వ్యతీపాత యోగం రాత్రి 3.25 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రహాల గమనం, తిథి యోగాల ప్రభావం వలన ఈరోజు ఏ రాశివారికి అదృష్టం వరిస్తుందో, ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఈరాశివారు ఆదిదంపతులను ఆరాధించాలి.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈరోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటతీరుతో పైఅధికారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈరాశి వారు శ్రీమహాలక్ష్మీదేవిని ఆరాధించాలి.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ రోజు ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆకస్మికంగా వచ్చే ఆటంకాలను మీ సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రణాళికాబద్ధంగా పని చేస్తే సాయంత్రానికి విజయం మీదే అవుతుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. ఈరోజు ఈరాశివారు లక్ష్మీనారాయణులను ఆరాధించాలి.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ప్రారంభించే ప్రధాన పనుల్లో తిరుగులేని విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఊహించని విధంగా భారీ ఆర్థిక లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. పెద్దగా మార్పులేమీ ఉండవు కానీ, రావలసిన బాకీలు వసూలవుతాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ కలిగి ఉండటం మంచిది. అనవసర ప్రయాణాలు తగ్గించుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈరోజు ఈరాశివారు గణపతిని ఆరాధించాలి.
తులారాశి
ఈ రోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వం లభించినప్పటికీ, సామాజిక విషయాల్లో కాస్త ఓర్పు వహించాలి. ముఖ్యంగా సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఆశించిన ఆర్థిక వనరుల నుండి ధనలాభం అందుతుంది. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఈరోజు ఈరాశివారు ప్రసన్నాంజనేయ స్వామిని ఆరాధించాలి.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కల నెరవేరే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు నవగ్రహ శ్లోకాలను పఠించడం మంచిది.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేయాలి. గ్రహాల సంచారం అనుకూలంగా లేదు కాబట్టి, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరికైనా అప్పులు ఇవ్వడం వంటి పనులకు దూరంగా ఉండండి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు దత్తాత్రేయుడిని ఆరాధించాలి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ సృజనాత్మక ఆలోచనలు సమాజంలో మీకు అపూర్వమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు ఈరాశివారు పార్వతీదేవిని ఆరాధించాలి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మీరు సాధించిన విజయాలు మీ హోదాను పెంచుతాయి. గత కొన్ని రోజులుగా పీడిస్తున్న కుటుంబ సమస్యలు ఈ రోజుతో ముగుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు మహాశివుడికి అభిషేకం చేయడం మంచిది.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశుల ఫలితాలు సామాన్యమైనవి. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఇచ్చినవి కావు.




