Daily Horoscope: రాశిఫలాలు - గజకేసరియోగం... ఈ 5 రాశులకు ఆర్థికలాభం

Daily Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఆకాశంలో ఒక అరుదైన గ్రహ సమ్మేళనం జరుగుతోంది. మిథున రాశిలో చంద్రుడు, గురువు కలవబోతున్నారు.

Balachander
Published on: 21 April 2026 8:02 AM IST
Daily Horoscope
X

Daily Horoscope

Daily Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఆకాశంలో ఒక అరుదైన గ్రహ సమ్మేళనం జరుగుతోంది. మిథున రాశిలో చంద్రుడు, గురువు కలవబోతున్నారు. దీనివల్ల అత్యంత శక్తివంతమైన 'గజకేసరి యోగం' ఏర్పడుతోంది. దీనికి తోడు శుక్రుడి అనుగ్రహంతో 'మాళవ్య రాజయోగం', 'అనఫ యోగం' కూడా తోడయ్యాయి. ఈ శుభ యోగాల ప్రభావం వల్ల మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులవారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. చంద్రుడు మూడో స్థానంలో ఉన్నందున, పట్టుదలతో ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి మాళవ్య రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం అందుతుంది. మీ చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ రోజు బియ్యం దానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది.

మిథున రాశి:

గజకేసరి యోగం వల్ల ఈ రోజు మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి:

వ్యాపారస్తులకు ఈ రోజు కలిసి వచ్చే రోజు. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు అనుకూలం. కుటుంబ సభ్యుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

సింహ రాశి:

సూర్యుడి అనుగ్రహం వల్ల సింహ రాశి వారికి ధనలాభం కలుగుతుంది. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. అయితే, భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడి ఆరాధన మీకు రక్షణ కవచంలా మారుతుంది.

కన్యా రాశి:

ఈ రోజు మీకు పనిభారం అధికంగా ఉంటుంది. ఆఫీసులో ఓపికగా ఉండటం ముఖ్యం. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. పాత తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం శ్రేయస్కరం. స్నేహితులో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి:

గురు గ్రహ అనుగ్రహం వల్ల తులా రాశి వారికి గతంలో రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. మానసిక ఒత్తిడి కొంచెం ఉన్నప్పటికీ, బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. చేసే పనుల్లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. అయితే, మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మంచిది.

ధనస్సు రాశి:

సప్తమ స్థానంలో గజకేసరి యోగం వల్ల ధనస్సు రాశి వారికి అదృష్టం వరిస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాల వల్ల సందడి నెలకొంటుంది.

మకర రాశి:

ఈ రోజు మీకు లాభాలు ఉన్నప్పటికీ, శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆదాయ మార్గాలు పెరిగినా, జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు రావచ్చు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సుబ్రహ్మణ్యుడి ఆరాధన శ్రేయస్కరం.

కుంభ రాశి:

కుంభ రాశి వారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. చిన్న విషయాలకే కోపం ప్రదర్శించవద్దు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఆఫీసు పనుల్లో ఏకాగ్రత అవసరం. సహోద్యోగులతో సఖ్యతగా ఉండాలి.

మీన రాశి:

మీన రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉన్నత విద్య చదివే విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై శుభవార్తలు వింటారు. కాలభైరవుడి దర్శనం శుభప్రదం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story