Daily Horoscope: ఏప్రిల్ 24 రాశిఫలాలు: ఈరోజు ఈ మూడు రాశులకు తిరుగులేదు
Daily Horoscope: నేడు వైశాఖ శుక్ల పక్ష అష్టమి తిథి, పుష్యమీ నక్షత్రం కలయికతో కూడిన అత్యంత శుభప్రదమైన రోజు.
Daily Horoscope: ఏప్రిల్ 24 రాశిఫలాలు: ఈరోజు ఈ మూడు రాశులకు తిరుగులేదు
Daily Horoscope: నేడు వైశాఖ శుక్ల పక్ష అష్టమి తిథి, పుష్యమీ నక్షత్రం కలయికతో కూడిన అత్యంత శుభప్రదమైన రోజు. ఆధ్యాత్మికంగా చైతన్యం పొందేందుకు, గ్రహ దోష నివారణకు ఈ శుక్రవారం ఎంతో అనుకూలం. ఈ నేపథ్యంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ప్రయత్నాలకు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు సుబ్రహ్మణ్యుడి ఆరాధన శుభప్రదం.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గి, ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే రోజు. వ్యాపారంలో లాభాల మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. కుటుంబంలో ఆనందం, సంతృప్తి కనిపిస్తుంది. ఈరోజు ఈరాశివారు లక్ష్మీగణపతి ఆరాధన చేయాలి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో చిన్న ఆటంకాలు వస్తాయి కానీ మీరు అధిగమిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచితే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించడం మంచిది.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి. ఖర్చులు నియంత్రించాలి. ఈరోజు ఈరాశివారు శ్రీరామచంద్రుడి ఆలయాన్ని సందర్శించడం మంచిది.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో గౌరవం, పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వినోదం పెద్ద మొత్తంలో ఖర్చులు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు కులదేవతల ఆరాధన శుభప్రదం.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు పెరుగుతుంది. ఆదాయం పెరుగుతున్న సూచనలు ఉన్నాయి. పదోన్నతులు సాధ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు ఈరాశివారు ఆదిశంకరాచార్య విరచిత కనకధార స్తోత్రం పారాయణం చేయాలి.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. తక్కువ శ్రమతోనే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు, విదేశీ అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చేస్తున్న పనిలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాల కోసం కష్టపడాలి. ఖర్చులను తగ్గించాలి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వలన మనసుకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత ఫర్వాలేదు. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. వ్యాపారంలో కొంత పురోగతి ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తెలివితో వాటిని అధికమిస్తారు. ఖర్చులు పెరగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. ఈరోజు ఈరాశివారు శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. తారాబలం మీకు అనుకూలంగా ఉంది. ఆర్థిక లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈరోజు ఈరాశివారు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడం మంచిది.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈరాశివారు కులదేవతల ఆరాధన చేయడం శ్రేయస్కరం.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చేపట్టిన పనుల కోసం ఒత్తిడితో కూడిన శ్రమ చేయాల్సి రావొచ్చు. ఆస్తి పంపకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలి. నీటి గండం ఉంది. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు అభయ ఆంజనేయుడి ఆలయ దర్శనం శుభకరం.
గమనికః ఇవి కేవలం సామాన్య రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు మారుతాయి. వ్యక్తిగత రాశిఫలితాల కోసం జ్యోతిష్యుడిని సంప్రదించడం ఉత్తమం.




