Daily Horoscope: జులై 10 రాశిఫలాలు - అడుగడుగునా ఆటంకాలే...వివాదాలకు దూరంగా ఉండాలి
ఈరోజు ద్వాదశ రాశులు జీవితాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
Daily Horoscope: శుక్రవారం పైగా ఏకాదశి అంతేకాకుండా ఈరోజు ధృతి, శూల, గండయోగాలు కలిసి రావడంతో ప్రతి రాశివారు తీసుకునే నిర్ణయాల్లో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోపం, తొందరపాటు, వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. శ్రీమహావిష్ణువు ఆరాధన, తులసి పూజ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కాగా, ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా లాభసూచన. బదిలీల కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మనోధైర్యంతో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలను పాటించాలి.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒత్తిడి ఎదురైనా ధైర్యంగా నిలబడతారు. ఖర్చులు పెరుగుతాయి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్తంగా ఉన్నాయి. చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారంలో ఒత్తడి పెరుగుతుంది. ఉచిత సలహాలతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్లు రావొచ్చు.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే, మానసిక ఆందోళనకు గురికావలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగినా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పదిమందికి మంచి చేసేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే, ఉచిత సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించకుండా ఉండటం మేలు.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. చేపట్టిన పనులు కొంతవరకు పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. మీమాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ శ్రేయోభిలాషులతో తప్పకుండా చర్చించాలి. నూతన ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అవసరాలకు కావలసిన ధనం చేతికి అందుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. స్థిరాస్తులు కొనుగోలుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈరోజు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గడిచిపోతుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. విరాళాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన పనులు పూర్తి చేసేందుకు శక్తిమేరకు ప్రయత్నిస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. చెల్లింపులు చెల్లించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. మీకోసం పనిచేసేవారి పట్ల శ్రద్ద వహించాలి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. పనులను వేగంగా పూర్తి చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు రావొచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారం సాదాసీదాగా సాగుతుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తి వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




