Daily Astrology: జులై 11 రాశిఫలాలు - అద్భుత యోగంతో ఊహించని పరిణామాలు... పట్టిందల్లా బంగారమే
జులై 11 శనివారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాల ప్రభావం వీటిపై ఏ విధంగా ఉండబోతుందో విశ్లేషిద్దాం.
Daily Astrology: జులై 11 శనివారం బహుళ పక్ష ద్వాదశి తిథితో పాటు సుబ్రహ్మణ్యస్వామి నక్షత్రమైన కృత్తిక కూడా ఉండటం, అంతే కాకుండా, గండ యోగం కలిసి రావడంతో ఈరోజు ద్వాదశ రాశులకు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దాదాపుగా అన్ని రాశుల వారికి ఈరోజు మంచి ఫలితాలే ఉన్నాయి. అయితే, పొదుపు చేయడంపైన, చిన్న చిన్న సమస్యలపైన దృష్టిసారించాలి. మరి ఈరోజు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ఎదురైన అవాంతరాలు తొలగిపోతాయి.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ఓ సమాచారం మీ మనసుకు ఊరటనిస్తుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. విమర్శలు తొలగిపోతాయి. సంఘంలో తగిన గుర్తింపు లభిస్తుంది.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆటంకాలను అవలీలగా అధికమిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్ధులు చదువులో రాణిస్తారు. మీ అంచనాలు నిజమౌతాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. రుణసమస్యల నుంచి బయటపడతారు.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో వేగం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్ధికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉండే అవకాశం ఉంది.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మీపై నమ్మకం పెరుగుతుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాలను విస్తరించుకుంటారు.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేస్తారు. మీరు తలపెట్టిన పనులు కార్యరూపం దాల్చుతాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యపరంగా ఉపశమనం లభిస్తుంది.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. శతృవులు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అవసరాలకు తగినంత ధనం చేతికి అందుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసికంగా కొంత ఇబ్బందులు ఎదురౌతాయి. నిరుద్యోగులకు నిరాశజనకమైన ఫలితాలు ఉండొచ్చు. ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబంలో చీకాకులు ఎదురౌతాయి. ఇక ఉద్యోగులకు శ్రమపెరుగుతుంది.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలను అమలు చేస్తారు. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పెండింగ్లో ఉన్న రుణాలను పూర్తిచేస్తారు. ఆదనపు ఆదాయం సమకూరుతుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. సమస్యలు కొలిక్కివస్తాయి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. వివాదాల నుంచి బయటపడతారు. తగాదాలకు దూరంగా ఉంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. పొదుపు చేయడంపై దృష్టిపెడతారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసేందుకు ఆసక్తిచూపుతారు. వివాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




