Astrology:జులై 13 రాశిఫలాలు - లక్కంటే ఈ రాశులవారిదే...ఈరోజు ఏది పట్టుకున్నా బంగారమే
ఈరోజు ద్వాదశ రాశుల జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ధృవయోగ బలం చేత కీలకమైన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
Astrology: ఈరోజు నిజ జ్యేష్ఠమాసం బహుళపక్షం చతుర్థశి తిథి. ఆరుద్ర నక్షత్రం, ధృవయోగం ప్రభావం చేత గ్రహబలం అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగా ద్వాదశ రాశుల్లో కీలకమైన మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం. అన్నింటా విజయం సాధిస్తారు.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు చాలా నిదానంగా ముందుకు సాగుతాయి. కీలక పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండొచ్చు. మాట పట్టింపులకు పోరాదు.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అనుకోని పనులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, గతంలో చేపట్టిన పనులకు సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఆలోచనలు కలిసివస్తాయి. కొత్త వారితో పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తారు. ప్రమోషన్లు రావొచ్చు. వ్యాపారంలో అనుకోని లాభాలుంటాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మాటలు జారే అవకాశాలు ఉన్నాయి.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఆర్థికంగా కొత్త సమస్యలు ఎదురుకావొచ్చు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వివాదాలకు చోటుంది. శ్రమ పెరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించాలి. రాబడి పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఉగ్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితలం లభిస్తుంది. వివాదాలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. బదిలీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలు చాలా వరకు పరిష్కారమౌతాయి. కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో పలుకుబడి కొంత పెరుగుతుంది.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన పరిచయాలు పురోభివృద్దికి సహకరిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాదాలు పరిష్కారమౌతాయి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. రుణాల నుంచి విముక్తి పొందుతారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఓర్పుతో ఈరోజును ప్రారంభించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పనులను కొన్నింటి పూర్తి చేస్తారు. ఆర్ధికంగా ఫర్వాలేదు. ఉద్యోగులు కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన వ్యక్తిగత ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించాలి.




