Astrology: జులై 14 రాశిఫలాలు - అమావాస్య నుంచి వీరి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి
అమావాస్య రోజు పలు రాశుల్లో మార్పులు సంభవించబోతున్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అత్యుత్తమ కాలంగా చెప్పవచ్చు.
Astrology: ఈరోజు అమావాస్య తిథి కావడంతో పితృదేవతల ఆరాధన జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు అమావాస్య తిథి ఉండటం, వ్యాఘాత యోగం కలిసి రావడంతో పలు రాశులపై వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ కారణంగా ద్వాదశ రాశుల్లో అనూహ్యమైన మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్యం విషయంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా పండితులు చెబుతున్నారు.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పదిమందికి మంచి చేసేందుకు ప్రయత్నిస్తారు. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేతికి రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు విజయవంతమౌతాయి. ఉద్యోగంలో ఒత్తిడిలు తగ్గతాయి. పొదుపు పధకాలపై దృష్టిసారిస్తారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం మీ పురోభివృద్దికి దోహదపడుతంది. ఉద్యోగాల్లో పదొన్నతులు లభించే అవకాశం ఉంది. అవసరాలకు మించి ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. కుటుంబ సభ్యల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉండాలి. నిరుద్యోగులకు చేదు అనుభవాలు ఎదురౌతాయి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఓర్పుగా ఉండటం చాలా అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. సమస్యలు కొలిక్కి వస్తాయి. అయితే, బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు మంచి సమయం. నూతన పెట్టుబడులు పెడతారు. సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. వివాదాలు చాలా వరకు పరిష్కారమౌతాయి. ప్రశంసలు పొందుతారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. అయితే, ఈ రాశివారు ఈరోజు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రశంసలు అందుకుంటారు.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. అయితే, ఖర్చులను వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గించుకోవాలి. నూతన ఒప్పందాలు మేలు చేస్తాయి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. అయితే, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. దూకుడుగా వ్యవహరించరాదు. ఆర్థికంగా ఫర్వాలేదు. ప్రమోషన్లు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడాల్సి ఉంటుంది. ఓర్పుగా వ్యవహరించడం చాలా అవసరం. సమస్యలు కొలిక్కి వచ్చేందుకు జాగ్రత్తగా కృషి చేయాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. సంపూర్ణ వ్యక్తిగత ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




