Daily Astrology: జులై 16 రాశిఫలాలు - ఆర్థికంగా లాభాలు...ఆనుకోని విజయాలు ఈ రాశుల సొంతం

ఆషాఢమాసంలో రెండో రోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాల ప్రభావం చేత ఏ రాశివారికి ఎటువంటి విజయాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 16 July 2026 8:23 AM IST
Daily Astrology: జులై 16 రాశిఫలాలు - ఆర్థికంగా లాభాలు...ఆనుకోని విజయాలు ఈ రాశుల సొంతం
X

Daily Astrology: ఈరోజు ఆషాఢమాసం శుక్లపక్షం విదియ తిథితో పాటు ఆశ్లేష నక్షత్రం సిద్దియోగం కలిసి వచ్చింది. ఈ యోగం పలు రాశులపై అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, గ్రహాల ప్రభావం చేత అనుకోని విజయాలు, ఆర్థికంగా లాభాలు వస్తాయి. మరి ద్వాదశ రాశులపై వీటి ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందామా.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి అన్నివిధాలుగా అనుకూలంగా ఉంది. పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి మెప్పు పొందుతారు. వ్యాపారపరంగా కలిసి వస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయడంపైనే దృష్టిసారించాలి. మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించేందుకు కొందు ప్రయత్నిస్తుంటారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. బుద్ది, మనోబలంతో పనిచేస్తారు. చాలా వరకు పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఆశయలకు తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఒత్తిడి నుంచి బయటపడతారు. ఓ శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఉద్యోగంలో మీకు అన్ని విధాలుగా కలిసివస్తుంది. స్థిరత్వాన్ని క్రమంగా అలవాటు చేసుకుంటారు. లౌక్యాన్ని ప్రదర్శించి సహోద్యోగుల మెప్పు పొందుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అపార్థాలకు తావు ఇవ్వకూడదు.

సింహరాశి

ఈరోజు ఈరాశి వారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. మీ మనోబలమే ముందుకు నడిపిస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేస్తారు. పొదుపుపై దృష్టిసారిస్తారు. మీరు కొనుగోలు చేసిన స్థిర ఆస్తులకు మరింత విలువ పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం అనుసరించి అడుగులు వేస్తారు.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అమలు చేసే విషయంలోనూ వెనకడుగు వేయరు. వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాల కొంత అనుకూలంగా ఉన్నాయి. మీరు వీలైనంత వరకు ఏకాగ్రతతో పనిచేయాలి. మెరుగైన ఫలితాల కోసం ఏకాగ్రతతో ఉండాల్సిన అవసరం ఉంది. సహోద్యోగులతో స్నేహంగా మెలగాలి. మీ మిత్రుల అండతో కీలక కార్యక్రమాలను పూర్తిచేస్తారు. మీ సొంత వ్యాపారంలో ఇతరులను జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమౌతాయి. నూతన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పై అదికారుల నుంచి మీకు అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. పదిమందికి మంచి చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన సంపదల కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమౌతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పట్టుదలతో అవరోధాలను అధికమిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నమ్మిన సిద్దాంతం వైపుకు అడుగులు వేస్తారు. సంకల్పంతో పనులను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు విజయం సాధించేంతవరకు ఓర్పుతో వ్యవహరిస్తారు. నూతన ప్రయోగాలకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. మనోబలం సిద్ధిస్తుంది. ఏ పని చేపట్టినా మనోబలంతో పూర్తిచేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మొహమాటాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సహోద్యోగులతో వీలైనంత వరకు స్నేహంగా మెలగాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితమైనవిగా ఉండాలి. అవరోధాలు ఎదురైనా దైర్యాన్ని కోల్పోవద్దు. పెద్దల సలహాలు సూచనలు తీసుకోవాలి. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలకు ఈరోజు అనుకూలంగా లేదు.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story