Daily Astrology: జులై 17 రాశిఫలాలు - ఈ 5 రాశులకు అదృష్టయోగం

జులై 17న ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరికి ఈరోజు అనుకూలంగా ఉన్నదో, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Balachander
Published on: 17 July 2026 7:33 AM IST
Daily Astrology: జులై 17 రాశిఫలాలు - ఈ 5 రాశులకు అదృష్టయోగం
X

Daily Astrology: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువులో ఆషాఢ శుక్ల పక్ష తదియ రోజైన జులై 17 శుక్రవారం గ్రహస్థితులు ప్రతి రాశిపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరికి ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరమైతే, మరికొందరికి ఉద్యోగం, కుటుంబం, ఆస్తి, వ్యాపారం వంటి అంశాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా వివేకంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మరి ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి

ఈరోజు మేషరాశి వారికి కొంత ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. రుణాలు తీసుకోవాలనే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ చేపట్టిన పనులను పూర్తి చేయాలనే పట్టుదల కనిపిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి జీవితంపై కొత్త అవగాహన కలిగే అవకాశం ఉంది. సమాజానికి ఉపయోగపడే పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే ఎవరికైనా హామీలు ఇవ్వడం లేదా ఇతరుల బాధ్యతలు తీసుకోవడం మంచిది కాదు.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈరోజు కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. బంధువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సహనంతో ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి అంశాన్ని పరిశీలించి ముందడుగు వేయడం మంచిది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఈరోజు విజయానికి కీలకం.

మిథునరాశి

మిథునరాశి వారికి అనుకూలమైన రోజు. ఉద్యోగ మార్పులు కోరుకునేవారికి ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడతాయి. బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా, వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు.

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారు నిర్ణయాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందుతుంది. పెండింగ్ బాకీలు తీర్చే అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అనవసర సమస్యలు దూరమవుతాయి. మీరు ఎంతోకాలంగా అనుకున్న కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచనలు కలుగుతాయి. ఒక ముఖ్యమైన సమాచారం భవిష్యత్ ప్రణాళికలపై ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కన్యారాశి

కన్యారాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన ఒప్పందాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. పనుల్లో ఆలస్యం జరిగినా నిరుత్సాహపడకూడదు. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య పరంగా గతంతో పోలిస్తే మెరుగుదల కనిపిస్తుంది.

తులారాశి

తులారాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజు. ఇంట్లో బంధుమిత్రుల రాకపోకలతో సందడి వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాల సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం కాదు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. గతంలో దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవుతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఖర్చులు పెరిగినా భవిష్యత్ అవసరాల కోసమేనని భావించి ఆందోళన చెందవద్దు.

ధనస్సురాశి

ధనుస్సు రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంది. చిన్న విహారయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు పనిలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. పని ఒత్తిడి పెరిగినా ప్రశాంతంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలను పూర్తిగా నివారించాలి.

మకరరాశి

మకరరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. పనులను సమయానికి పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్ విషయాల్లో తల్లిదండ్రులు సరైన ప్రణాళికలు రూపొందిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల గౌరవం పెరుగుతుంది.

కుంభరాశి

కుంభరాశి వారికి ఈరోజు కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మనసుకు బాధ కలిగించవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు. అయితే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. విలువైన పత్రాలు లేదా అధికారిక సమాచారం చేతికి అందుతుంది. వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా వినియోగించుకోవాలి.

మీనరాశి

మీనరాశి వారికి ఈరోజు శుభఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొని బంధుమిత్రులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తి వ్యక్తిగత జాతక ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story