July 2026 Horoscope: జులై మాసంలో ఈ రాశులకు తిరుగులేదు...ఏది పట్టుకున్నా బంగారమే

జులై నెలలో ద్వాదశ రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో...రాశులపై గ్రహాల ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఏ రాశికి అదృష్టయోగం ఉన్నదో...ఎవరు జాగ్రత్తగా ఉండాలో పరిశీలిద్దాం.

Balachander
Published on: 29 Jun 2026 7:52 AM IST
July 2026 Horoscope: జులై మాసంలో ఈ రాశులకు తిరుగులేదు...ఏది పట్టుకున్నా బంగారమే
X

July 2026 Horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జులై నెలలో రాశులపై గ్రహాల ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించనున్నది. ఈ గ్రహాల ప్రభావంతో కొన్ని రాశులకు అదృష్టం వరించబోతున్నది. అంతేకాదు, అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే, దీనికి కష్టం, శ్రమ కూడా ఉండాలి. మరి జులై నెలలో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి

మేషరాశివారికి జులై నెల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉన్నది. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. జీతాలు పెరుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక కుటుంబంలో ఎన్నడూ చూడని విధంగా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు.

వృషభరాశి

వృషభరాశి వారికి జులై నెల కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే సమయంలో ఆలోచించాలి. ఉద్యోగులకు కలిసి వస్తుంది. అయితే, ఈ నెలలో వీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. శ్రమ దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కీలక పనులను వాయిదా వేయడం మంచిది.

మిథునరాశి

మిథునరాశివారికి జులై నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యాపార విస్తరణ పనులు చురుగ్గా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన కాలం. మీ మాటకు విలువ పెరుగుతుంది. పదిమందిలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ మాసంలో పలు ఆలయాలను సందర్శిస్తారు.

కర్కాటకరాశి

కర్కాటకరాశివారికి జులై నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు కొంత అనుకూలంగా ఉన్నా...పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో చీకాకులు ఎదురుకావొచ్చు. లక్ష్యాలను చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు నిరాశ ఎదురౌతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహరాశి

సింహరాశివారికి జులై నెలలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. చాలా కాలంగా చేతికి అందకుండా పోతున్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు అనుకూలం. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆదాయంతో పాటు స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు లభిస్తాయి.

కన్యారాశి

కన్యారాశివారికి జులై నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ జ్యేష్ఠమాసం చివర్లో మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారంలో కొంత శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు తీవ్రంగా కష్టపడాలి. మాసాంతంలో ఓ శుభవార్త స్వాంతన చేకూరుస్తుంది.

తులారాశి

తులారాశివారికి జులై నెల కొంత అనుకూలంగా ఉన్నది. ఆసక్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి. ఈ మాసంలో కృష్ణపక్షంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది.

వృశ్చికరాశి

వృశ్చికరాశివారికి జులై నెల సంతృప్తికరంగా ఉంటుంది. ఈ నెలలో అనుకున్న విధంగా అన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార రంగంలోని వారికి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సురాశి

ధనస్సురాశివారికి జులై నెలలో ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో కీలక పాత్రను పోషిస్తారు. నష్టాలు లేకుండా బయటపడతారు. విద్యార్థులకు శుభకరమైన ఫలితాలు ఉంటాయి. వారాంతాల్లో బాల్య స్నేహితులను కలుసుకుంటారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.

మకరరాశి

మకరరాశివారికి ఈ జులై నెల పెద్దగా కలిసిరాకపోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదురుకావొచ్చు. సహోద్యోగుల సలహాలు స్వీకరించాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని పనులను ఈ నెలలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ రాశివారు పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు తీసుకునే ఓ నిర్ణయం శ్రావణంలో మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.

కుంభరాశి

కుంభరాశివారికి జులై నెల మధ్యస్థంగా ఉన్నది. మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. ఉద్యోగులకు ఈ నెల గడ్డుకాలమనే చెప్పాలి. అనుకున్న పనులను శ్రద్ధాశక్తులతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. వాయిదా వేయకుండా ఉండటమే మేలు. చిన్న చిన్న లక్ష్యాలు నెలాఖరులో నెరవేరుతాయి. వ్యాపారంలో కొంత కలిసి వస్తుంది. నిరుద్యోగులు ఈ నెలాఖరులో శుభవార్తలు వింటారు.

మీనరాశి

మీనరాశివారికి జులై నెల అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు కోసం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. కుటుంబంలో మీకు గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, అనవసరమైన వివాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది.

గమనికః ఇక్కడ ఇచ్చిన ఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. పూర్తిస్థాయి జాతక మాస ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story