Daily Astrology: జులై 22 రాశిఫలాలు -ఈ రాశుల వారికి మహాయోగం... పట్టిందల్లా బంగారమే
జులై 22న కొన్ని రాశుల వారికి మహాయోగం పట్టబోతున్నది. ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు.
Daily Astrology: జులై 22, 2026న గ్రహ నక్షత్రాల ప్రభావం ప్రకారం కొన్ని రాశుల వారికి రోజు ఎంతో అనుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం వంటి విషయాల్లో ఆశించిన ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కొందరికి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికాగా, మరికొందరికి అదనపు ఆదాయం వచ్చే మార్గాలు తెరుచుకోవచ్చు. అయితే ప్రతి రాశివారూ తమకు అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.
మేషరాశి
ఈరోజు ఈరాశివారు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. పొదుపు చేయడంపై దృష్టిపెడతారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసేందుకు ఆసక్తిచూపుతారు.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారు వివాదాల నుంచి బయటపడతారు. తగాదాలకు దూరంగా ఉంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేస్తారు. మీరు తలపెట్టిన పనులు కార్యరూపం దాల్చుతాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యపరంగా ఉపశమనం లభిస్తుంది.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలను అమలు చేస్తారు. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను పూర్తిచేస్తారు. ఆదనపు ఆదాయం సమకూరుతుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. సమస్యలు కొలిక్కివస్తాయి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారు నూతన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారు. శుభకరమైన కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారు ఆటంకాలను అవలీలగా అధికమిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్ధులు చదువులో రాణిస్తారు. మీ అంచనాలు నిజమౌతాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. రుణసమస్యల నుంచి బయటపడతారు.
తులారాశి
ఈరోజు ఈరాశివారు కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన ప్రత్యర్థులు మీకు మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అవసరాలకు తగినంత ధనం చేతికి అందుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారు కొత్త పనులను చేపడతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారు చేసిన రుణాలు తీరుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ఓ సమాచారం మీ మనసుకు ఊరటనిస్తుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. విమర్శలు తొలగిపోతాయి. సమాజంలో మీకు ఊహించని విధంగా గుర్తింపు లభిస్తుంది.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి సంబంధించిన వివాదాలు కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మీపై నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు వ్యాయామం వంటివి చేస్తుండాలి. వ్యాపారాలను విస్తరించుకుంటారు.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీకు చీకాకులు తెప్పించిన కొన్ని అవాంతరాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసికంగా కొంత ఇబ్బందులు ఎదురౌతాయి. నిరుద్యోగులకు నిరాశజనకమైన ఫలితాలు ఉండొచ్చు. ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబంలో చీకాకులు ఎదురౌతాయి. ఇక ఉద్యోగులకు శ్రమపెరుగుతుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.




