Daily Horoscope: జులై 3 రాశిఫలాలు - ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం... సంపూర్ణ ఆరోగ్యం
జులై 3న ఏ రాశులకు ఆకస్మిక ధనలాభం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, విద్యలో శుభఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Daily Horoscope: జులై 3వ తేదీ గురువారం గ్రహాల సంచారం, తిథి, నక్షత్ర ప్రభావం కారణంగా పన్నెండు రాశుల వారికి భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆకస్మిక ధనలాభం, మరికొందరికి ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు, కుటుంబ సౌఖ్యం కలిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుండగా, వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించే యోగం ఉంది. అయితే కొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. ఈ రోజు పంచాంగ విశేషాలతో పాటు ప్రతి రాశి వారికి కలిగే ఫలితాలను తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. కొన్ని పనులు చివరిదశకు చేరుకుంటాయి. ఆదనపు ఆదాయం చేతికి అందుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ జీవనశైలిలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని బాధించే వారికి దూరంగా ఉండాలి. కార్యాలయంలో సహోద్యోగులతో వీలైనంత వరకు సౌమ్యంగా వ్యవహరించాలి. మీ అవసరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. కెరీర్‌పై మీరు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారు ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ ఆశయాలే మీ విజయానికి కారణమౌతాయి. పలువురి ప్రశంసలు అందుకుంటారు. మిత్రులతో కలిసి నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. చేయాలనుకున్న పనులను అశ్రద్ధ చేయకుండా ముందుకు సాగేలా ప్రణాళికలు వేసుకుంటారు. పదిమందికి అవసరమయ్యే పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టిపెడతారు. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత స్థిరత్వం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. రుణబాధల నుంచి విముక్తి పొందుతారు.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారు ఎదుగుదల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది. కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. రాజకీయరంగంలోని వారికి ఈరోజు కలిసి వస్తుంది
తులారాశి
ఈరోజు ఈరాశివారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల మద్దతుతో పలు విజయాలు సాధిస్తారు. శుభవార్తలు వింటారు. వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మాటకు విలువ పెరుగుతుంది.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. అయితే, నేనే గొప్ప అనే దృక్పధాన్ని విడిచిపెట్టాలి. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి అనుకూలంగా ఉంది. పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకోని విధంగా లాభాలు ఉంటాయి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉత్సాహంతో పనులు మొదలుపెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కటుంబంలో మీ విలువ పెరుగుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
మీనరాశి
ఈరోజు ఈరాశివారు కొన్ని శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో వృద్ది కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.




