Daily Horoscope: జులై 31 రాశిఫలాలు - ఈ రోజు అదృష్టమంతా ఈ రాశులదే
జులై 31న ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు ఐదు రాశుల వారికి అదృష్టయోగం కలగనున్నది. మిగిలిన రాశులవారు జాగ్రత్తలు తీసుకుంటే గట్టెక్కుతారు.
Daily Horoscope: శ్రీ పరాభవ నామ సంవత్సరంలోని ఆషాఢ బహుళ పక్ష విదియ సందర్భంగా ఈ రోజు గ్రహస్థితులు కొన్ని రాశులకు విశేషమైన విజయాలను అందించగా, మరికొన్ని రాశులకు ఓర్పు, సహనం, ఆలోచనతో ముందుకు సాగాలని సూచిస్తున్నాయి. ఇక ఈ రోజు ఆషాఢ బహుళ విదియ రాత్రి 10.31 గంటల వరకు, అనంతరం తదియ తిథి ప్రారంభమవుతుంది. ధనిష్ఠ నక్షత్రం సాయంత్రం 7.26 గంటల వరకు, ఆ తరువాత శతభిష నక్షత్రం కొనసాగుతుంది. సౌభాగ్య యోగం రాత్రి 11.54 గంటల వరకు, అనంతరం శోభన యోగం ఉంటుంది. తైతిల కరణం ఉదయం 10.04 గంటల వరకు, తర్వాత గరజి కరణం రాత్రి 10.31 గంటల వరకు, ఆపై వణిజ కరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఈ గ్రహ సంయోగాల ప్రభావంతో తుల, వృశ్చిక, కన్య, మకర, మిథున రాశుల వారికి ప్రత్యేక అనుకూలత కనిపిస్తోంది. మిగిలిన రాశుల వారు ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులను సులభంగా అధిగమించగలరు.
మేషరాశి
ఈ రోజు మేష రాశి వారు తొందరపాటు కంటే సహనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రారంభించిన పనుల్లో మధ్యలో నిరుత్సాహం వచ్చినా పట్టుదల వదలకపోతే చివరికి మంచి ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చినా, సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో చిన్న ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించడం అవసరం. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం వల్ల వారి ఆదరణ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి వంటి స్వల్ప సమస్యలు రావచ్చు.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో క్లిష్టమైన పనులు ఎదురైనా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అవి పరిష్కారమవుతాయి. వ్యాపారంలో ఆశించినంత వేగం లేకపోయినా క్రమశిక్షణతో కొనసాగితే భవిష్యత్తులో మంచి లాభాలు కనిపిస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడటం వల్ల చిన్న సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ రోజు శుభసూచకంగా ఉంటుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం లేదా శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు సంతోషాన్ని అందిస్తాయి. పిల్లల విషయంలో సంతృప్తికరమైన వార్తలు వినే అవకాశం ఉంది.
కర్కాటకరాశి
ఈ రోజు కర్కాటక రాశి వారు ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. వ్యాపారంలో పెద్ద నిర్ణయాల కంటే చిన్న ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచితే అనవసర విభేదాలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొన్ని ఆలస్యాలు, పనుల్లో ఆటంకాలు వచ్చినా మీ స్థిరమైన ఆలోచన సమస్యలను దాటిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక ప్రవాహం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు స్థిరాస్తుల విషయంలో కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది.
తులారాశి
తులారాశి వారికి ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి పదోన్నతి అవకాశాలు బలపడతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఆర్థికంగా విశేష పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
వృశ్చికరాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా, గౌరవం రెండూ పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభవార్తలు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. కొత్త వస్త్రాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ధనస్సురాశి
ధనుస్సు రాశి వారు ఈ రోజు ప్రతి నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి. ఉద్యోగంలో తొందరపాటు నష్టాన్ని కలిగించవచ్చు. వ్యాపారంలో మితమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల అపార్థాలు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
మకరరాశి
మకర రాశి వారికి ఈ రోజు శుభయోగాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అంతరంగ శాంతి లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి వారు ఈ రోజు పనిభారాన్ని సమతుల్యం చేసుకోవాలి. వ్యాపారంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా మితవ్యయం పాటించడం అవసరం. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
మీనరాశి
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన విషయాల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగాలి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో మీ పరిపక్వత అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉంటుంది. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశుల ఫలితాలు కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక సంపూర్ణ ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.




