Daily Horoscope: ఏకాదశి రాశి ఫలితాలు... ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే...కానీ
విశిష్టమైన ఏకాదశి తిథితో పాటు శోభన, అతిగండ యోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.
Daily Horoscope: ఈ రోజు అధిక జ్యేష్ఠ బహుళ పక్ష ఏకాదశీ తిథి. హిందూ సంప్రదాయంలో ఏకాదశీకి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఉపవాసం, భగవన్నామ స్మరణ, దానధర్మాలు చేయడానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. రేవతి నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రంలోకి సంచారం జరుగుతుండటంతో అనేక రాశులవారికి కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రాశులవారు ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఏకాదశి, శోభన, అతిగండయోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఏవిధంగా ఉండబోతుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు వృత్తి పరంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఒప్పందాలు, హామీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈరాశివారు గాయత్రీదేవిని ఆరాధించడం శుభప్రదం.
వృషభరాశి
ఈరోజు నిరుద్యోగులు మరింతగా శ్రమించాలి. విజ్ఞులైనవారితో సంప్రదింపులు జరుపుతారు. సలహాలను పాటిస్తారు. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసేవారికి ఒత్తిడి, చీకాకులు ఎదురౌతాయి. ఈరోజు ఈరాశివారు లక్ష్మీదేవిని ఆరాధించాలి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజుఈరాశివారు నవగ్రహారాధన చేయాలి.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారు ప్రయాణాలు చేసే సమయంలో నిదానం పాటించాలి. విద్యార్థులు చుదువులో రాణిస్తారు. ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయాలి.
సింహరాశి
ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఇంటి వాతావరణం కొంత ఇబ్బందులకు గురిచేస్తుంది. రుణాల కోసం తీవ్రంగా శ్రమిస్తారు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. ఈరోజు ఈరాశివారు సాయిబాబాను ఆరాధించాలి.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారు వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చర్చలు ఫలిస్తాయి. మీకు అత్యంత ఇష్టమైన వారికోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈరాశివారు కన్నయ్యను ఆరాధించాలి.
తులారాశి
ఈరోజు గతంలో తలపెట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. లావాదేవీలు అనుకూలిస్తాయి. చిరువ్యాపారులకు లాభాలు వస్తాయి. పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పఠించాలి.
వృశ్చికరాశి
ఈరోజు చిరువ్యాపారుల లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శక్తికి మించి పనిచేయాల్సి వస్తుంది. విద్యార్థులు ఏకాగ్రత కోసం వృత్తివిద్యపై దృష్టిసారించాలి. ఈరోజు ఈరాశివారు గురుగ్రహాన్ని ఆరాధించాలి.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారు డబ్బు వృధాగా ఖర్చు చేస్తారు. ధనం సమయానికి అందకపోవడంతో పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. బంధువులు రాకతో మీ ఇల్లు కళకళలాడుతుంది. విదేశీ ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈరాశివారు సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారు ఆర్థికలావాదేవీలపై చర్చిస్తారు. క్రయవిక్రయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కుటుంబసభ్యుల సలహాలను స్వీకరించాలి. పత్రాలు, విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయాలి.
కుంభరాశి
ఈరోజు నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలవాట్లను అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని వీలైనంతవరకు బయటపడకుండా చూసుకోవాలి. దూరప్రయాణాలు చీకాకును కలిగిస్తాయి. కొత్త రుణాలు చేసేందుకు ప్రయత్నిస్తారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. ఈరోజు ఈరాశివారు దత్తాత్రేయుడిని ఆరాధించాలి.
మీనరాశి
ఈరోజు వ్యాపార లావాదేవీలకు అనుకూల సమయం కాదు. కొన్ని విషయాల్లో తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. తలపెట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. మార్పులు చేర్పులకు అవకాశం. ఖర్చులు పెరిగేఅవకాశం ఉంది. విద్యార్థులు మరింత కష్టపడి చదవాలి. ఈరోజు ఈరాశివారు శ్రీమహావిష్ణువును ఆరాధించాలి.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించాలి.




