Astrology: రాశిఫలాలు - ఈ ఐదు రాశులకు అదృష్టయోగం... ఉద్యోగులకు ఊహించని విజయం

ఈరోజు ఐదు రాశుల వారికి అదృష్ట యోగం ఉండగా... మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మిగతా నాలుగు రాశుల వారి జాతకం వీటికి భిన్నంగా ఉండబోతున్నది. మరి ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Balachander
Published on: 18 Jun 2026 7:56 AM IST
Astrology: రాశిఫలాలు - ఈ ఐదు రాశులకు అదృష్టయోగం... ఉద్యోగులకు ఊహించని విజయం
X

Astrology: నిజ జ్యేష్ట మాస శుక్ల పక్ష చవితి తిథి, పుష్యమి నక్షత్ర ప్రభావంతో ఈ రోజు గ్రహస్థితులు అనేక రాశుల జీవితాల్లో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక కర్కాటకం, కన్య, తుల, కుంభం, మీన రాశుల వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండనున్నది. అదేవిధంగా వృత్తి వ్యాపార రంగాల్లో అవకాశాలు కనిపిస్తాయి. కానీ, మేషం, ధనస్సు, మకర రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. మొత్తంగా ఈ రోజు ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పెరిగినా చివరకు అనుకున్న ఫలితం లభించే అవకాశం ఉంటుంది. కానీ, అనవసరంగా ఖర్చులు పెరుగతాయి. ఆర్థిక నియంత్రణ అవసరం. ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడేసమయంలో జగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి

ఈరోజు తెలివితో వ్యవహరిస్తారు. సమయస్పూర్తితో పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాద బలం మీకు వందశాతం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంది.

మిథునరాశి

ఊహించని శుభవార్తలు వింటారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు అవకాశాలు లభిస్తాయి. ప్రతిభకు గుర్తింపు, ప్రమోషన్లు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బాల్య స్నేహితులతో సరదాగా గడుపుతారు.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి అదృష్టయోగం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో లాభాలు, పెట్టుబడుల్లో వృద్ధి వంటి శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

సింహరాశి

అధికారులతో జరిగే చర్చలు ఫలితస్తాయి. పదోన్నతులు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి లాభదాయకమైన రోజు. వృత్తిపరంగా మంచి పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం పెరగడంతో పాటు ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా మారే సూచనలు ఉన్నాయి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి చేస్తున్న ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది.

వృశ్చికరాశి

గత కొంతకాలంగా ఎదురైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పట్టుదలతో చేసిన పనులకు ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా ఆశాజనకమైన వార్తలు వినే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి కొన్ని కఠినమైన పరీక్షలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక భారాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మేలు చేస్తుంది.

మకరరాశి

ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభించినా ఖర్చులు భారీగా పెరుగుతాయి. నియంత్రణ పాటించాలి. బంధు మిత్రులతో విబేధాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.

కుంభరాశి

ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story