Daily Astrology: రాశిఫలాలు - అనుకోని లాభాలు...ఊహించని విజయాలు ఈ రాశుల సొంతం
జూన్ 20 శనివారం ఏ రాశివారికి ఎటువంటి జాతక ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరికి లాభం ఉన్నది ఎవరికి సూచనలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
Daily Astrology: ఈరోజు వజ్ర యోగం, సిద్ధి యోగం కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తే, మరికొందరు ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గ్రహస్థితులు మన ఆలోచనలు, నిర్ణయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి. అంతేకాదు, ఈరోజు ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారికి అనుకూల గ్రహబలం కనిపిస్తోంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు, వ్యాపారాల్లో లాభాలు, కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు అందుకునే అవకాశం కూడా ఉంది. ఈ యోగాల కలయిక ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.
మేషరాశి
ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని ఆటంకాలు ఎదురైనా మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదు కానీ, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబంలో శాంతం వహించడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం ముఖ్యం. సూర్యారాధన చేయడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి.
వృషభరాశి
మీ శ్రమకు అదృష్టం తోడయ్యే అద్భుతమైన రోజు ఇది. తక్కువ ప్రయత్నంతోనే పెద్ద విజయాలు సాధిస్తారు. నూతన వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే యోగం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక బలం పెరుగుతుంది. ఈ రోజు అమ్మవారిని తలుచుకుంటూ శ్రీలక్ష్మి ధ్యానం చేయడం వల్ల మరింత సంపద చేకూరుతుంది.
మిథునరాశి
తలపెట్టిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ధనలాభాలు, ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలపై ఆసక్తి చూపుతారు. కులదైవాన్ని స్మరిస్తే చాలు, మీ సంకల్పాలు నెరవేరుతాయి.
కర్కాటకరాశి
ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబంలో చిన్నపాటి కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఓర్పు వహించండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. మహాశివుడిని ఆరాధించడం వలన ప్రతికూలతకు తగ్గుతాయి.
సింహరాశి
మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బుద్ధిబలంతో కుటుంబ సమస్యలను చక్కదిద్దుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పంచముఖ ఆంజనేయుని ఆరాధన మీకు విశేష జయాన్ని ఇస్తుంది.
కన్యారాశి
వ్యాపారంలో ప్రణాళిక లోపం వల్ల ఇబ్బందులు రావచ్చు. ఇతరుల ప్రవర్తన మిమ్మల్ని బాధించినా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. కార్యసిద్ధి గణపతి ఆరాధన చేయడం వల్ల పనులు సజావుగా సాగుతాయి.
తులారాశి
సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి ఆర్థికంగా లాభపడతారు. ప్రియమైన వారితో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆదిత్య హృదయం పారాయణం చేయడం ఈ రోజు అత్యంత శుభకరం.
వృశ్చికరాశి
లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉన్న రోజు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం వలన మానసిక స్థైర్యం పెరుగుతుంది.
ధనస్సురాశి
కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందుల్లో పడకండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది.
మకరరాశి
మీ దీర్ఘకాలిక ప్రయత్నాలకు తుదిఫలితాలు లభించే అవకాశం వచ్చింది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఊహించని ఖర్చులు వచ్చినా తట్టుకోగలరు. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడం శుభకరం.
కుంభరాశి
ఈ రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా సాగిపోతుంది. ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తారు. కష్టానికి తగినట్లుగా రెట్టింపు ప్రతిఫలం, ధనలాభం అందుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కులదైవాన్ని పూజించడం శుభకరం.
మీనరాశి
వృత్తి, వ్యాపారాలలో బుద్ధిబలంతో అడ్డంకులను అధిగమిస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో పెద్దల సలహాలు పాటించండి. ఈరోజు నవగ్రహారాధన చేసి శ్లోకాలను పఠించడం వలన మానసికంగా ధైర్యం లభిస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించాలి.




