Daily Astrology: రాశిఫలాలు - గురువారం ఏకాదశితో ఈ రాశుల తలరాత మారిపోతుంది

జూన్ 25 గురువారం ఏకాదశి రోజున 12 రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక పరిహారాల వివారాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 25 Jun 2026 8:01 AM IST
Daily Astrology: రాశిఫలాలు - గురువారం ఏకాదశితో ఈ రాశుల తలరాత మారిపోతుంది
X

Daily Astrology: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా గురువారం రోజున ఏకాదశి రావడం వల్ల విష్ణుభక్తులకు ఇది విశేషమైన ఆధ్యాత్మిక అవకాశంగా చెప్పవచ్చు. ఈ రోజు స్వాతి నక్షత్ర ప్రభావం, శివం యోగం, సిద్ధ యోగం కలిసి జీవితంలో పురోగతి కోరుకునే వారికి శుభసూచనలు అందిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం కేవలం భవిష్యత్తును సూచించడమే కాదు, మన ఆలోచనలను, నిర్ణయాలను, అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే రాశిఫలాలను ఒక మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగితే అనేక సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. మరి ఈ గ్రహాల ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఆధ్మాత్మికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ముందుకుసాగుతాయి. నూతన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మీ సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారు కీలక బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. తొందరపడి మాటలు జారవద్దు. విద్యార్ధులు చదువుపైనే ప్రధానంగా దృష్టిసారిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారు అనుకున్న పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. గతంలో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పెద్దల సహకారం తీసుకోవాలి. వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కుటుంబమే మీ బలంగా మారుతుంది. ఉద్యోగస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ఈరోజు వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారు తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబానికి ఈరోజు కొంత సమయాన్ని కేటాయిస్తారు. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారు వాదనలకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ నిరుత్సాహంగా ఉండరాదు. ప్రతి పనిని జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

తులారాశి

ఈరోజు ఈరాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొత్త అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధికమిస్తారు. ఉత్సాహంగా పనిచేయాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పై అధికారులతో మీరు ప్రవర్తించే తీరును బట్టి ప్రమోషన్లు వస్తాయి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారు అదనపు భారాన్ని, బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. మీరు చేపట్టిన నూతన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు.

ధనూరాశి

ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో తెలియని అడ్డందుకు ఎదురౌతాయి. మానసికంగా ముందడుగు వేయాలి. ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు చదువులో రాణిస్తారు.

మకరరాశి

ఈరోజు ఈరాశివారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈరోజు పర్వాలేదు. వ్యాపారరంగంలోని వారికి అనుకోని విధంగా ఆటంకాలు ఎదురౌతాయి. కొత్త పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి రావొచ్చు. పెద్దల సలహాలు, సూచనలను పాటించాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారు భవిష్యత్‌ గురించి తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. నూతన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మీనరాశి

ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కూర్చొని చర్చించుకోవాలి. గతంలో ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తిచేస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపారానికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకుంటారు.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. పూర్తి జాతక ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story