కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినరంటే.. అసలు రహస్యం ఇదే!
Karthika Masam: కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన కోసం మనోనిగ్రహం కోసం సాత్విక ఆహారం తీసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు.
కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినరంటే.. అసలు రహస్యం ఇదే!
కార్తీక మాసంలో చాలా మంది మాంసాహారాన్ని తినడానికి దూరంగా ఉంటారు. శివకేశవుల ఆరాధనకు ఎంతో పవిత్రమైన ఈ నెలలో మనోనిగ్రహం కోసం సాత్విక ఆహారం తీసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఈ పవిత్ర మాసంలో భక్తులు కఠిన నియమాలను పాటిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. స్కంద పురాణం ప్రకారం మాంసాహారం తామసిక గుణాన్ని కలిగి ఉంటుందని నిషేధించారట. సాత్విక ఆహారంతో మనసు ప్రశాంతంగా ఉండి పూజలపై మనసు నిలుస్తుందని నమ్ముతారు. అందుకే ఈ కాలంలో పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలని పెద్దలు చెబుతుంటారు.
అంతేకాకుండా జీవహింసకు దూరంగా ఉంటూ, మూగజీవాల పట్ల కరుణ చూపడమే ఈ ఆచారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ మాసంలో ఉపవాసాలు, దీపారాధనలు చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ మహావిష్ణువు, శివుడిని ఏకకాలంలో ఆరాధించే ఈ మాసంలో శరీరశుద్ధితో పాటు అంతఃశుద్ధి కూడా చాలా ముఖ్యమని పండితులు పేర్కొంటున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా మనసును అచంచలంగా ఉంచుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సాంప్రదాయం వెనుక ఆరోగ్య పరమైన కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది కాబట్టి, తేలికపాటి శాకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.




