Mangal Nakshatra Gochar 2026: అక్టోబర్ 17న ఆశ్లేష నక్షత్రంలోకి కుజుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలు!
Mangal Nakshatra Gochar 2026: అక్టోబర్ 17న ఆశ్లేష నక్షత్రంలోకి కుజుడు ప్రవేశం! ఈ 5 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది.
Mangal Nakshatra Gochar 2026: అక్టోబర్ 17న ఆశ్లేష నక్షత్రంలోకి కుజుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలు!
Mangal Nakshatra Gochar 2026: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతకంలో అంగారకుడి (కుజుడు) స్థానం బలంగా ఉంటే వ్యక్తిలో శక్తి, సామర్థ్యాలు, ధైర్యసాహసాలు విశేషంగా పెరుగుతాయి. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న కుజుడు అక్టోబర్ 17న (శనివారం) నాడు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. అదే రోజు మధ్యాహ్నం 12:56 గంటలకు బుధుడు అధిపతిగా వ్యవహరించే ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు కన్య రాశి నుంచి తులా రాశిలోకి మారే సమయంలో జరిగే ఈ గోచారం వల్ల పలు రాశుల వారి జాతకాలు తిరగబడనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో బంపర్ ప్రయోజనాలు పొందబోతున్న ఆ రాశులేవో చూద్దాం.
వృషభ రాశి: కుజుడి నక్షత్ర మార్పు వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన మార్పులు రానున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడమే కాకుండా, విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
సింహ రాశి: పెండింగ్లో ఉన్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన గుర్తింపు, పురోగతి లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం.
కన్యా రాశి: ఆశ్లేష నక్షత్రంలో కుజుడి ప్రవేశం వల్ల కన్యా రాశి వారికి కెరీర్లో ఊహించని పురోగతి సాధ్యమవుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. శక్తి, సామర్థ్యాలు పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
తులా రాశి: ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
మకర రాశి: ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆస్తి వ్యాపారాలు చేసే వారికి ఈ కాలం బంగారు సమయం. నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంపత్య జీవితం మధురంగా మారుతుంది.
గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత జాతకం లేదా ఇతర ముఖ్యమైన నిర్ణయాల విషయంలో సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.




