Daily Horoscope: రాశిఫలాలు - ఈ రాశుల వారికి ఈరోజు ఇంద్రభోగం
ఈ రోజు గ్రహస్థితి ప్రకారం ఎవరికీ ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Daily Horoscope: వైశాఖ మాసం ఆధ్యాత్మిక శక్తులు అధికంగా ప్రసరించే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ రోజు బహుళ పక్ష నవమి తిథి మధ్యాహ్నం 03.24 వరకు కొనసాగి, తరువాత దశమి తిథి ప్రారంభమవుతుంది. శతభిష నక్షత్ర ప్రభావం రాత్రి 01.28 వరకు ఉండటంతో, చాలామంది రాశుల వారికి ఆలోచనల్లో మార్పులు, పనుల్లో స్పష్టత, కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఐంద్ర యోగం కారణంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అయితే కొన్ని రాశుల వారు ఖర్చులు, ఆరోగ్యం, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు గ్రహస్థితి ప్రకారం ఎవరికీ ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినా, ఏకాగ్రతతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకెళ్తే లాభాలు పొందుతారు. కొంతకాలంగా ఆగిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న విభేదాలు వచ్చినా సాయంత్రానికి పరిస్థితి సర్దుకుంటుంది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు సూర్యనమస్కారాలు చేసి ఆదిత్య హృదయం చదవడం మానసిక ప్రశాంతత ఇస్తుంది.
వృషభరాశి
ఈ రోజు వృషభ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. భూమి, వాహనం, గృహ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశముంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ఆర్థికంగా బలపడే రోజు. మీరు చేసిన పాత సహాయం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ మాటతీరు వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో చిన్న పెట్టుబడులతో మంచి లాభాలు వస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం శుభప్రదం.
కర్కాటకరాశి
కర్కాటక రాశివారు ఈ రోజు ప్రతి పనిలో ఓపికతో వ్యవహరించాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు ఇతరుల మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో అపార్థాలు రాకుండా మాట్లాడే ముందు ఆలోచించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు నవగ్రహ ప్రార్థన చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ రోజు బుద్ధిబలం ఉపయోగపడే రోజు. ఉద్యోగంలో క్లిష్టమైన పని మీ తెలివితో పూర్తి చేస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఆలస్యంగా అయినా లాభాలు వస్తాయి. ఖర్చులు నియంత్రించకపోతే చేతిలో డబ్బు నిలవదు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం మానసిక ఆనందం ఇస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ ఆరాధన చేయడం మంచిది.
కన్యారాశి
కన్య రాశి వారికి ఈ రోజు ధనయోగం కనిపిస్తోంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభం పొందే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయం కీలక సమయంలో ఉపయోగపడుతుంది. ఈరోజు ఈరాశివారు శివారాధన చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తులారాశి
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం నుంచే పనుల్లో పరుగులు పెరిగినా, చివరికి మీరు అనుకున్న ఫలితాలు అందుకునే అవకాశముంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో అనవసర వాదనలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు చేపట్టిన పనులు వేగంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా మంచి సమాచారం అందవచ్చు. వ్యాపారంలో కొత్త లాభదాయక అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా చేతికి డబ్బు వచ్చే రోజు. పాత బాకీలు తిరిగి అందే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహకారం ప్రతి విషయంలో కలిసివస్తుంది. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.
ధనస్సురాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఏ పని చేసినా ఓపికతో ముందుకెళ్లాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయాలపై ఆందోళన చెందకుండా ఉంటే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారస్తులు ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టకూడదు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఊహించని ఖర్చులు పెరిగి ఇబ్బంది కలిగించవచ్చు. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు రావచ్చు. మాట్లాడే సమయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు శ్రీమహావిష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
మకరరాశి
మకర రాశి వారికి ఈ రోజు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటంతో చాలా పనులు సాఫీగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను అధికారులు గుర్తిస్తారు. పదోన్నతి లేదా జీతం పెరుగుదల గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు ఇవ్వవచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం శుభప్రదం.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో క్లిష్టమైన సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు లాభం చేకూరుస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. ఈరోజు ఈరాశివారు కలియుగదైవాన్ని దర్శించుకోవడం మంచిది.
మీనరాశి
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ముందుచూపుతో వ్యవహరిస్తే పనిభారం తగ్గుతుంది. వ్యాపారస్తులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో జీవిత భాగస్వామి సహకారం వల్ల కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈరోజు ఈరాశివారు హనుమాన్ ఆలయాన్ని లేదా హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కాదు.




