Daily Horoscope: ఈరోజు ప్రీతియోగంతో బంగారుమయం కానున్న రాశులు ఇవే
ప్రీతియోగం ద్వాదశ రాశుల్లో తెచ్చే మార్పులు, అదృష్టం, జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.
Daily Horoscope: వైశాఖ మాస బహుళ పక్ష ద్వాదశి తిథి ఈరోజు ఉదయం 11.20 గంటల వరకు ఉంటుంది. ఈ తరువాత త్రయోదశి తిథి ప్రారంభం అవుతుంది. ఇక రాత్రి 10.34 గంటల వరకు రేవతి నక్షత్ర ప్రభావం ఉండగా, తర్వాత అశ్విని నక్షత్ర ప్రవేశం జరుగుతుంది. ప్రీతి యోగం సాయంత్రం 5.53 గంటల వరకు ఉండడం వల్ల చాలా రాశుల వారికి ఆధ్యాత్మిక చింతన, కుటుంబ అనుబంధాలు, ఆర్థిక నిర్ణయాల్లో స్పష్టత కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు తీసుకునే నిర్ణయాల్లో ఓర్పు, ఆత్మవిశ్వాసం, భగవద్భక్తి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రోజు ఈరాశి వారికి శ్రమ ఎక్కువగా కనిపించినా, ఫలితం మాత్రం కొంత ఆలస్యంగా అందుతుంది. ఉద్యోగంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని భావించినా, ప్రతి నిర్ణయాన్ని రెండుసార్లు ఆలోచించడం మంచిది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యవహారాల్లో లాభ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ప్రశాంతత ఇస్తుంది. అనవసర ఆందోళనలను దూరంగా ఉంచితే మంచిది. ఈరోజు ఈరాశివారు సాయిబాబాను ఆరాధించాలి.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి సహనం అత్యంత అవసరం. ఉద్యోగ బాధ్యతలు పెరగడంతో ఒత్తిడి అనిపించవచ్చు. ఆర్థికంగా డబ్బు చేతిలోకి వచ్చినా, ఖర్చులు వెంట వెంటనే రావడం ఆలోచన కలిగిస్తుంది. కుటుంబంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలకు అనుకూల సమయం. ఈరోజు ఈరాశివారు హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి.
మిథునరాశి
ఈ రోజు ఈరాశి వారికి శుభప్రదమైన సమయం. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండొచ్చు. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.
కర్కాటకరాశి
ఈ రోజు ఈరాశివారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రారంభించిన పనుల్లో కొంత ఆటంకం ఎదురైనా, పట్టుదలతో కొనసాగితే ఫలితం లభిస్తుంది. వ్యాపారాల్లో లెక్కలు స్పష్టంగా చూసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు. కుటుంబంలో శాంతి కోసం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు ఈరాశివారు చేసే సూర్యారాధన శ్రేయస్సును అందిస్తుంది.
సింహరాశి
ఈరోజు ఈరాశి వారికి పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సంపాదన బాగున్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార నిర్ణయాల్లో తొందరపడకండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ప్రశాంతత కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి అదృష్టం బలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో గుర్తింపు పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి.
తులారాశి
ఈరోజు ఈరాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. కుటుంబంలో చిన్నచిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. శనిదేవుని ధ్యానం మానసిక బలాన్ని ఇస్తుంది
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి క్రమంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు. ఇంటి వాతావరణంలో శాంతి కాపాడుకోవడం ముఖ్యం. ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి.
ధనస్సురాశి
ఈ ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. పురోగతి కొంత మందగమనంగా అనిపించవచ్చు. పనుల్లో ఆలస్యం, వ్యాపారంలో ఒత్తిడి ఉండొచ్చు. సహనం కోల్పోకుండా ముందుకు వెళ్తే సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. నవగ్రహ ప్రార్థనలు చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
మకరరాశి
ఈ రోజు ఈరాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు అవసరం. శివారాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కుంభరాశి
ఈ రోజు ఈరాశివారికి అత్యంత శుభప్రదమైన రోజు. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. శ్రీరామ నామ స్మరణ శుభఫలితాలను మరింత పెంచుతుంది.
మీనరాశి
ఈ రోజు ఈరాశివారికి బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. బంధువుల ప్రవర్తన కొంత బాధ కలిగించినా, ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలాలు సామాన్యమైనవి మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఇచ్చినవి కాదు.




