Daily Horoscope: ఆయుష్మాన్ యోగం - ఈ రాశులవారికి అన్నింటా విజయం
ఆయుష్మాన్ యోగం ద్వాదశ రాశుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో, ఎవరికి విజయం వరిస్తుందో... ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Daily Horoscope: వైశాఖ మాసంలోని బహుళ పక్ష త్రయోదశి తిథి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ రోజు ఉదయం 08.31 వరకు త్రయోదశి తిథి, అనంతరం చతుర్దశి తిథి కొనసాగుతుంది. అశ్విని నక్షత్ర ప్రభావం రాత్రి 08.14 వరకు ఉండటంతో చాలా రాశుల వారికి కొత్త ఆలోచనలు, నిర్ణయాలు, ఆధ్యాత్మిక చైతన్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయుష్మాన్ యోగం కారణంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయి. భద్ర కరణం ప్రభావంతో కొన్ని రాశుల వారు మాటల్లో సంయమనం పాటించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు కీలక మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాలు తీసుకువస్తాయి. అయితే ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఈరోజు ఈరాశివారు దుర్గాదేవి దర్శనం చేసుకోవాలి.
వృషభరాశి
గ్రహబలం మీకు అనుకూలంగా ఉన్న రోజు ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం కనిపించినా అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మిథునరాశి
ఈ రోజు మీరు చేసే ప్రతి పని ధైర్యాన్ని పెంచుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తే లాభాలు వస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించే వారు పెరుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. స్నేహితుల సహాయం కీలకంగా మారుతుంది. ఈరోజు ఈరాశివారికి ఈశ్వరుని దర్శనం శుభ ఫలితాలు ఇస్తుంది.
కర్కాటకరాశి
ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆలస్యాలు నిరాశ కలిగించినా ధైర్యం కోల్పోవద్దు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం మంచిది కాదు. ఈరోజు ఈరాశివారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసికంగా దృఢంగా మారతారు.
సింహరాశి
ఈ రోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర యాత్ర గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు విఘ్నేశ్వరుని దర్శించుకోవాలి.
కన్యారాశి
ఈ రోజు ఈరాశివారు ఓర్పుతో వ్యవహరించాలి. మీరు చేసే పనుల్లో ఆలస్యం జరిగినా ఫలితం మాత్రం మంచిగానే ఉంటుంది. ఉద్యోగంలో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు భాగస్వాముల అభిప్రాయాలను గౌరవించడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి.
తులారాశి
కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన మానసిక ఆనందం కలుగుతుంది.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఇటీవల ఇబ్బంది పెట్టిన సమస్యలు ఈ రోజు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఈరోజు ఈరాశివారు లక్ష్మీదేవి ధ్యానం చేయడం వలన ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు.
ధనస్సురాశి
ఈ రోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. పనుల్లో ఆలస్యం, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారు మరికొంత సమయం వేచి చూడటం మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం మేలు చేస్తుంది.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు ఈరాశివారు శివారాధన చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శుభప్రదం.
మీనరాశి
ఈ రోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేయాలి. వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు ఈరాశివారు శని ధ్యాన శ్లోకాలు చదవడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు ఎవరి వ్యక్తిగత జాతకాన్ని ఉద్దేశించి ఇచ్చినవి కావు.




