Daily Horoscope: సౌభాగ్యయోగం - ఈ రాశుల జీవితంలో ఊహించని మార్పులు
సౌభాగ్యయోగం, అమావాస్య తిథి కారణంగా ద్వాదశ రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Daily Horoscope: ఈరోజు వైశాఖ అమావాస్య తిథి రాత్రి 1.30 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత అధిక జ్యేష్టమాసం ప్రారంభం అవుటుంది. అదేవిధఃగా సాయంత్రం 5.30 గంటల వరకు భరణీ నక్షత్రం కొనసాగి అనంతరం కృత్తిక నక్షత్రం ప్రవేశిస్తుంది. ఉదయం 10.26 గంటల వరకు సౌభాగ్యయోగం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పితృ తర్పణాలు, దేవాలయాల సందర్శనం, దానధర్మాలు చేయడానికి ఈరోజు అత్యంత విశేషమైనదిగా చెబుతారు. ఇక సౌభాగ్యయోగం, అమావాస్య తిథి కారణంగా ద్వాదశ రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగరంగంలో మీ నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. సహచరులతో కలసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఈరాశివారు ఇష్టదైవ దర్శనం చేయడం వలన మానసిక ప్రశాంతత ఇస్తుంది.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ రోజు గౌరవప్రదమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్త వింటారు. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. భూమి, ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి. ఈ రోజు ఈరాశివారు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తే మానసిక ధైర్యం పెరుగుతుంది.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రోజు. వ్యాపారంలో లాభాలు ఆశించిన దానికంటే ఎక్కువగా రావచ్చు. ఉద్యోగంలో మీ కృషి అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. స్నేహితుల సహాయం ద్వారా ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఈరోజు ఈరాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు ఆచితూచి వ్యవహరించడం మంచిది. చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా ఓర్పుతో ముందుకెళ్లాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. కుటుంబంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని సమర్థంగా నిర్వహిస్తే భవిష్యత్తులో పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్నిస్తుంది. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ రోజు శుభఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆటంకాలు వచ్చినా మీ తెలివితేటలతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమంగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. ఈరోజు ఈరాశివారు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది.
తులారాశి
తులా రాశి వారికి ఈ రోజు ఆనందకరంగా గడుస్తుంది. కుటుంబ వేడుకలు, స్నేహితులతో సమావేశాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది. బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు మహాలక్ష్మి ఆరాధన చేయాలి.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు విజయదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీ మాటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.
ధనస్సురాశి
ధనుస్సు రాశి వారు ఈ రోజు సహనంతో ముందుకెళ్లాలి. వ్యాపారంలో కొంత నిరుత్సాహం కలిగించే పరిణామాలు ఉండవచ్చు. ఉద్యోగంలో సహచరులతో వాదనలు రాకుండా జాగ్రత్తపడాలి. అనవసర ఖర్చులు తగ్గించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. ఈరోజు ఈరాశివారు ఆంజనేయుడి ఆలయాన్ని సందర్శించాలి.
మకరరాశి
మకర రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల నష్టాలు నివారించగలరు. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు గోచరిస్తాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగరంగంలో ఉన్నత అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మీనరాశి
మీన రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా ముందుగానే పనులను ప్రణాళిక చేసుకోవాలి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడితే సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యపరంగా అలసట ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు శివారాధన చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు ఎవరి వ్యక్తిగతాన్ని ఉద్దేశించి ఇచ్చినవి కావు.




