Daily Horoscope: శూల గండయోగం ప్రభావంః ఈ రాశుల వారు అద్భుతాలు సృష్టిస్తారు

శూలయోగంతో పాటు గండ యోగం కూడా ఉండటంతో వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

Balachander
Published on: 20 May 2026 7:41 AM IST
Daily Horoscope: శూల గండయోగం ప్రభావంః ఈ రాశుల వారు అద్భుతాలు సృష్టిస్తారు
X

Daily Horoscope: అధిక జ్యేష్ట మాస శుక్ల పక్ష చవితి సందర్భంగా ఈ రోజు గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు ఇవ్వగా, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి. ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉదయం వరకు ఉండగా, తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశం కారణంగా ఆధ్యాత్మిక చింతన, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు మంచిది కాదు. దేవతారాధన, శ్లోక పఠనం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు శూలయోగంతో పాటు గండ యోగం కూడా ఉండటంతో వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో భావోద్వేగాలకు లోనవకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడం మంచిది. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అసహనం ప్రదర్శించకుండా సహనంతో ముందుకు సాగాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అదుపులో లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలకు దారితీయకుండా జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు మహాశివుడిని ఆరాధించడం శ్రేయస్కరం.

వృషభరాశి

ఈ రోజు వృషభ రాశివారికి కొత్త అవకాశాలు తలుపుతడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త పరిచయాల ద్వారా లాభాలు పొందవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒక చిన్న మాటలతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అలసట వేధించే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు పంచముఖ హనుమాన్‌ను ఆరాధించడం శుభకరం.

మిథునరాశి

మిథున రాశివారికి ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశముంది. ఆర్థికంగా బలపడే రోజు ఇది. ఈరోజు ఈరాశివారు కొల్హాపురి మహాలక్ష్మిని ఆరాధించాలి.

కర్కాటకరాశి

కర్కాటక రాశివారు ఈ రోజు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాల్లో ఎవరి మాటకైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులు లాభనష్టాలు పరిశీలించి అడుగులు వేయాలి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు మానసిక ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించడం వలన మానసిక సమస్యల నుంచి బయటపడతారు.

సింహరాశి

సింహ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా బలపడే రోజు ఇది. కొత్త అవకాశాలు భవిష్యత్తుకు మంచి దారులు తెరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలపై చర్చలు జరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయడం శుభకరం.

కన్యారాశి

ఈ రోజు కన్య రాశివారికి పట్టిందల్లా బంగారమయ్యే రోజు. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతవృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. పితృసంబంధ ఆస్తి లేదా ఆర్థిక లాభం కలగవచ్చు. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం శ్రేయస్కరం.

తులారాశి

తులా రాశివారు ఈ రోజు పనుల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ఆలస్యమవడం వల్ల అసహనం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆదాయం వచ్చినా ఖర్చులు వెంట వెంటనే పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన కలుగుతుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈరాశివారు శివపంచాక్షరిని జపించడం వలన ఆందోళనలు తగ్గుముఖం పడతాయి.

వృశ్చికరాశి

వృశ్చిక రాశివారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయడం శుభకరం.

ధనస్సురాశి

ధనుస్సు రాశివారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు లాభాలు తెస్తాయి. సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు గణపతిని ఆరాధించడం శ్రేయస్కరం.

మకరరాశి

మకర రాశివారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందడుగు పడుతుంది. భాగస్వాములతో చర్చించి తీసుకునే నిర్ణయాలు లాభాలను తెస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం అన్ని విషయాల్లో బలాన్నిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహావిష్ణువును ఆరాధించాలి.

కుంభరాశి

కుంభ రాశివారికి ఈ రోజు ప్రత్యేకమైన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ప్రయాణాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు ఈరాశివారు ఆదిత్యహృదయం పఠించాలి.

మీనరాశి

మీన రాశివారు ఈ రోజు సహనంతో వ్యవహరించాలి. పనిభారం పెరిగినా భయపడకుండా ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో చిన్న ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు ఈరాశివారు ధన్వంతరి శ్లోకాలు పఠించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు కేవలం సామాన్యమైనవే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story