Daily Horoscope: వజ్ర సిద్ధి యోగంః ఈ రెండు రాశులకు అదృష్టంతో విడదీయలేని బంధం
వజ్రజ సిద్దియోగం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Daily Horoscope: అధిక జ్యేష్టమాసం శుక్లపక్ష దశమి తిథి ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ప్రత్యేకంగా భావించబడుతుంది. అంతేకాకుండా, ఈరోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ప్రభావం, వజ్ర, సిద్దియోగం కలిసి రావడంతో చాలా రాశుల్లో మార్పులు సంభవించబోతున్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వజ్రజ సిద్దియోగం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశివారికి ఈరోజు ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో మీ కృషికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ఆలోచనలపై దృష్టి పెడితే లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం మీరు తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయడం శ్రేయస్కరం.
వృషభరాశి
వృషభరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగంలో హోదా, గౌరవం పెరిగే సూచనలు ఉన్నా, ఇంటి వాతావరణంలో చిన్నచిన్న ఉద్రిక్తతలు కలగవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అనవసర సమస్యలు దూరమవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సమస్యలను వాయిదా వేయకుండా మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది. ఈరోజు ఈరాశివారు శివపంచాక్షరి జపం చేయడం ఉత్తమం.
మిథునరాశి
మిథునరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అధికారులు సహకారం అందిస్తారు. కుటుంబంలో నెలకొన్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బంధువులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు అంగారక గ్రహ ఆరాధన చేయాలి.
కర్కాటకరాశి
కర్కాటకరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈరోజు సహనం పాటించాలి. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో మాటలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ది హనుమాన్‌ను ఆరాధించాలి.
సింహరాశి
సింహ రాశి వారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. మీ నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థికంగా బలమైన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయడం శ్రేయస్కరం.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ రోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపించినా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. దాంపత్య జీవితంలో చిన్న విషయాలను పెద్దగా తీసుకోకపోవడం మంచిది. ఈరోజు ఈరాశివారు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించాలి.
తులారాశి
తులా రాశి వారికి ఈ రోజు ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం కోసం మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా వచ్చిన డబ్బు నిలవకపోవచ్చు. సమాజంలో గౌరవం దెబ్బతినే పనులకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు. ఈరోజు ఈరాశివారు మహాశివుడిని ఆరాధించడం శుభకరం.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభాలు తెస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. ఈరోజు ఈరాశివారు లక్ష్మీనారాయణులను ఆరాధించడం శ్రేయస్కరం.
ధనస్సురాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి, వ్యక్తిగత విషయాల్లో వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు లేదా ధార్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతత ఇస్తాయి. ఈరోజు ఈరాశివారు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
మకరరాశి
మకర రాశి వారికి ఈ రోజు ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. పనులు ఆలస్యమవడం, ఆశించిన ఫలితాలు రాకపోవడం నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. కుటుంబంలో ప్రశాంతత కోసం మీరు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఈరోజు ఈరాశివారు సూర్యాస్థకం పఠించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో చిన్న ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఆర్థిక నిర్ణయాలు లాభదాయకంగా మారుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు దత్తాత్రేయుడిని ఆరాధించడం వలన ఉద్యోగంలో కష్టాల నుంచి బయటపడతారు.
మీనరాశి
మీన రాశి వారికి ఈ రోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పరోపకార కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం బలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ధి గణపతిని ఆరాధించడం శ్రేయస్కరం.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కాదు.




