Daily Horoscope: ఏకాదశి సిద్దియోగంతో 12 రాశుల్లో వచ్చే మార్పులు ఇవే

ఏకాదశి తిథి, సిద్దియోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 26 May 2026 7:51 AM IST
Daily Horoscope: ఏకాదశి సిద్దియోగంతో 12 రాశుల్లో వచ్చే మార్పులు ఇవే
X

Daily Horoscope: అధిక జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా చెబుతారు. ఈ రోజు ఉపవాసం, దైవారాధన, జపధ్యానాలకు విశేష ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హస్తా నక్షత్ర ప్రభావం, సిద్ధి యోగం కలిసి ఈ మంగళవారం అనేక రాశుల వారికి శుభసూచనలు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు ఈ రోజు వణిజ కరణం సాయంత్రం 5.42 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత భద్ర కరణం ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యమైన పనులను మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ముందే పూర్తి చేయడం మంచిదిగా పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, సిద్దియోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. అనవసర ఆలోచనలకు దూరంగా ఉంటే మంచి ఫలితాలు పొందగలరు. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.

వృషభరాశి

ఈ రోజు వృషభ రాశి వారికి ప్రతిభ చాటుకునే అవకాశం లభిస్తుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. పలు రంగాల్లో మీకు అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. ఆర్థికంగా నిలకడ పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయడం శుభకరం.

మిథునరాశి

మిథున రాశి వారు ఈ రోజు ఆలోచించి అడుగులు వేయాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు తెచ్చే అవకాశముంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఒత్తిడులు ఎదురైనా సమయస్ఫూర్తితో పరిష్కరించగలుగుతారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఉత్తమం.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం, వృత్తి రెండింటిలోనూ సమతుల్యత అవసరం. సోదరులతో ఉన్న విభేదాలు తొలగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయరాదు. ఈరోజు ఈరాశివారు సిద్ధి గణపతి ఆరాధన చేయాలి.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ రోజు విజయదాయకంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా నిలుస్తుంది. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యుడి ఆరాధన చేయడం శుభకరం.

కన్యారాశి

కన్య రాశి వారికి ఈ రోజు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతస్థాయి గుర్తింపు దక్కే సూచనలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు లక్ష్మీనారాయణులను ఆరాధించడం శ్రేయస్కరం.

తులారాశి

తుల రాశి వారు ఈ రోజు కోపం, ఆవేశం నియంత్రించుకోవాలి. ఉద్యోగంలో అపార్థాలు కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా పెద్దగా నష్టం లేకపోయినా ఖర్చులు నియంత్రణలో ఉంచడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ది హనుమంతుడిని ఆరాధించాలి.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభవార్తలు ఆనందాన్ని నింపుతాయి. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను తెస్తాయి. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయడం శుభకరం.

ధనస్సురాశి

ధనుస్సు రాశి వారు ఈ రోజు సమయపాలన పాటిస్తే విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో కృషికి ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహావిష్ణును ఆరాధించాలి.

మకరరాశి

మకర రాశి వారికి ఈ రోజు కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబంలో చిన్న మనస్పర్థలు కలిగే అవకాశముంది. అనవసర ఖర్చులను తగ్గించండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు ఇష్టదేవతారాధన చేయడం వలన మేలు జరుగుతుంది.

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూల సమయం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు శక్తిని ఆరాధించడం వలన మేలు జరుగుతుంది.

మీనరాశి

మీన రాశి వారు ఈ రోజు సహనం పాటిస్తే మంచిది. ముఖ్యమైన పనులను ఆచితూచి పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కాదు. వ్యక్తిగత జాతకం కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story