Daily Horoscope: చిత్త, స్వాతి నక్షత్రాల సంచారం... ఈ రాశులవారికి తిరుగులేని విజయం
ఈరోజు గ్రహబలం, దైవబలం, మనోబలం మూడు కలిసి పనిచేసే రోజుగా పండితులు చెబుతున్నారు. కాగా, ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి లాభం, శుభవార్తలు వింటారు, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో తెలుసుకుందాం.
Daily Horoscope: మే 28,2026 గురువారం అధిక జ్యేష్టమాసం శుక్లపక్ష ద్వాదశి తిథి ద్వాదశ రాశులపై వివిధ రకాలైన ప్రభావం చూపించబోతున్నది. కొందరికి అదృష్టం కలిసి వస్తే, మరికొందరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు, ఈరోజు చిత్త, స్వాతి నక్షత్రాల సంచారం ఉంటుంది కాబట్టి ఆలోచనల్లో స్పష్టత, పనుల్లో వేగం కనిపిస్తుంది. ఈరోజు గ్రహబలం, దైవబలం, మనోబలం మూడు కలిసి పనిచేసే రోజుగా పండితులు చెబుతున్నారు. కాగా, ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి లాభం, శుభవార్తలు వింటారు, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఎన్నాళ్లుగానో ఆలోచిస్తున్న పనులకు సరైన దారి కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ తెలివితేటలు గుర్తింపు తెస్తాయి. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సభ్యుల కోసం తీసుకునే నిర్ణయాలు ప్రశంసలు అందిస్తాయి. ఈరోజు ఈరాశివారు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించడం శుభకరం.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈరోజు ఈరాశివారు ఇష్టదేవతారాధన చేయడం మేలు చేస్తుంది.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ రోజు పురోగతిని తీసుకువచ్చే రోజు. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల యోచనలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై కొద్దిపాటి జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో మెలకువగా ఉండడం అవసరం. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పెద్దల సలహా పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. ఈరోజు ఈరాశివారు సూర్యనారాయణుడిని ఆరాధించడం వలన పలు సమస్యల నుంచి బయటపడతారు.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. కొత్త ఆలోచనలు జీవితంలో మార్పుకు దారి తీస్తాయి. ఉద్యోగంలో మీ నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారంలో లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. ధనలాభం కలిగే అవకాశముంది. ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
కన్యారాశి
కన్య రాశి వారికి ఈ రోజు ఆనందకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో మీ కృషికి మంచి ఫలితం దక్కుతుంది. సహచరుల సహకారం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక సహాయం అవసరమైన సమయంలో అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఈరాశివారు గురు గ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుడిని దర్శించుకోవాలి.
తులారాశి
తులా రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో పెట్టుబడులు లాభాలను తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు ఆదిగురువు దక్షిణామూర్తిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారు ఈ రోజు ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. అధికారుల సూచనలను పాటించడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుంటే బంధాలు బలపడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పఠించాలి. తద్వారా కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది.
ధనస్సురాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభదాయకం. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రియమైన వారితో సమయం గడుపుతారు. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మి కుబేర మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం.
మకరరాశి
మకర రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు రావచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా సహనంతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో శాంతిగా మాట్లాడడం అవసరం. అనవసర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు ఈరాశివారు గణపతి ఆరాధన చేయడం వలన పలు ఇబ్బందుల నుంచి బయటపడతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. ధనలాభం, వస్త్రలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటారు. ఈరోజు ఈరాశివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వలన దోషాలు తొలగిపోతాయి.
మీనరాశి
మీన రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి పరంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ ఛాలీసా పఠించడం శ్రేయస్కరం.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.




