Horoscope: శివ సిద్ధియోగంతో ఈ రాశులవారి ఇంట అదృష్టపంట
ఈరోజు చతుర్ధశి తిథి, విశాఖ నక్షత్రంతో పాటు శివ, సిద్ధి యోగం కూడా ఉండటంతో ద్వాదశ రాశులపై వీటి ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.
Horoscope: అధిక జ్యేష్టమాసం చతుర్థశి తిథి, విశాఖ నక్షత్రం పైగా శనివారం. దీంతో ఈ రోజు ఆధ్యాత్మికంగా చైతన్యవంతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈరోజు శివయోగంతో పాటు సిద్దియోగం కూడా ఉండటం వలన పలు రాశుల వారికి శుభకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందగలరు. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థికంగా లాభసూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈరాశివారు గురు స్వరూపాన్ని ఆరాధించడం శుభకరం.
వృషభరాశి
ఈ రోజు వృషభ రాశి వారికి ఆనందాన్ని అందించే రోజు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరగవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. బంధుమిత్రులతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈరోజు ఈరాశివారు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించాలి.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుటుంబంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
కర్కాటకరాశి
లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్న కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ విషయాల్లో సహనం పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించాలి. ఆదిత్య హృదయం పఠించడం వలన మేలు జరుగుతుంది.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ రోజు విజయాన్ని అందించే రోజు. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు బలపడతాయి. వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు మహాశివుడికి అభిషేకం చేయడం మంచిది.
కన్యారాశి
కన్యారాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభించే రోజు. కొన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు దుర్గాదేవిని ఆరాధించడం శుభకరం.
తులారాశి
తులా రాశి వారికి ఈ రోజు జాగ్రత్త అవసరమైన రోజు. గత సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయి. అయితే ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకూడదు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అవసరం. కుటుంబంలో శాంతి నెలకొనేలా మాటల్లో సంయమనం పాటించాలి. కోపం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయడం శ్రేయస్కరం.
వృశ్చికరాశి
ఈ రోజు అత్యంత అనుకూల ఫలితాలు పొందే రాశులలో వృశ్చికం ఒకటి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. ఈరోజు ఈరాశివారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని ఆరాధించాలి.
ధనుస్సురాశి
ధనుస్సు రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులతో వాదనలు పెట్టుకోవడం మంచిది కాదు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలను కొంతకాలం వాయిదా వేయడం ఉత్తమం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న గొడవలు రావచ్చు. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ధి గణపతిని ఆరాధించాలి.
మకరరాశి
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు కీలకంగా మారుతాయి. అవివాహితులకు వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కొన్ని ఊహించని సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు హనుమంతుడిని ఆరాధించాలి.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ రోజు శుభదాయకంగా ఉంటుంది. ధనలాభం, శుభవార్తలు, విజయాలు మీ వెంట ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యుడిని ఆరాదించాలి.
మీనరాశి
మీన రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించాలి. కుటుంబంలో పరస్పర అవగాహన అవసరం. సంతానం విషయాల్లో కొంత ఆందోళన ఉండవచ్చు. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధిస్తూ, సూర్యాష్టకాన్ని పఠించాలి.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.




