Daily Horoscope: దుర్గాదేవి దర్శనంతో ఈ రాశుల వారికి అదృష్టం

ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుస్తుండగా, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తగా ముందుకు సాగమనే సంకేతాలు ఇస్తోంది.

Balachander
Published on: 7 May 2026 7:33 AM IST
Daily Horoscope: దుర్గాదేవి దర్శనంతో ఈ రాశుల వారికి అదృష్టం
X

Daily Horoscope: 2026 మే 7వ తేదీన ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వైశాఖ మాసం, బహుళ పక్ష పంచమి తిథి ఉంది. ఈ రోజు విశేషం ఏమిటంటే, ఆ పరమేశ్వరుని స్వరూపమైన గురు గ్రహానికి ప్రీతికరమైన గురువారం కావడం. సాయంత్రం వరకు పూర్వాషాఢ నక్షత్రం, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఉండటం వల్ల ఈ రోజు కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలను ఇస్తోంది. మరికొన్ని రాశులకు జాగ్రత్త సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


మేషరాశి

ఈరోజు ఈరాశివారు ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయాలి. ఉద్యోగంలో మీ తెలివితేటలు గుర్తింపు తెస్తాయి. వ్యాపారంలో భాగస్వామ్య నిర్ణయాలు లాభదాయకంగా మారతాయి. అయితే అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది కానీ బంధువులతో మాటపట్టింపులు రావచ్చు. ఆరోగ్యపరంగా అలసట ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు నవగ్రహ శ్లోకాల పఠనం మానసిక ప్రశాంతత ఇస్తుంది.

వృషభరాశి

ఈరోజు ఈరాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రారంభించిన పనులు సులభంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈరోజు ఈరాశివారు అభయ ఆంజనేయస్వామి దర్శనం చేయడం మంచిది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి వార్త వినే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త వ్యూహాలు విజయాన్ని అందిస్తాయి. నూతన వాహన యోగం కనిపిస్తోంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా నిలుస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అనుకూల ఫలితాలను ఇస్తాయి.

కర్కాటకరాశి

వ్యాపారులకు ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. అయితే ఉద్యోగస్తులు పనిలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబంలో మాట్లాడే మాటల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు ఈరాశివారు విఘ్నవినాయకుని ఆరాధించడం శుభప్రదం.

సింహరాశి

సింహ రాశి వారికి ఈరోజు సమయస్ఫూర్తి విజయాన్ని తెస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈరాశివారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమం.

కన్యారాశి

కన్య రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్య నిర్ణయాల్లో మీ ఆలోచనలకే ప్రాధాన్యం ఇవ్వండి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు దుర్గాదేవిని దర్శనం చేసుకోవడం శుభకరం.

తులారాశి

తుల రాశి వారికి ఈరోజు ఎంతో ఫలవంతంగా ఉంటుంది. అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా మారతాయి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. గణనాయకాష్టకం పఠించడం శుభప్రదం.

వృశ్చికరాశి

ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపార పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ప్రయాణాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. మీ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈరాశివారు ఇష్టదేవతారాధన చేయడం శ్రేయస్కరం.

ధనస్సురాశి

ధనుస్సు రాశి వారు ఈరోజు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు ఆదాయాన్ని మించవచ్చు. కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు రావచ్చు. సూర్య ఆరాధన మానసిక ధైర్యాన్ని ఇస్తుంది.

మకరరాశి

మకర రాశి వారికి ఈరోజు విజయ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారికి హనుమాన్ ఆరాధన కార్యసిద్ధిని ఇస్తుంది.

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయాలు వరుసగా వస్తాయి. ఆర్థిక లాభాలు అంచనాలకు మించి ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. అవివాహితులకు వివాహ యోగం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈరాశివారు శ్రీలక్ష్మీ గణపతిని దర్శించుకోవడం శుభప్రదం.

మీనరాశి

మీన రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో పట్టుదలతో ముందుకు వెళితే ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించవచ్చు. కుటుంబంలో మాటల వల్ల సమస్యలు రావచ్చు. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు కేవలం సామాన్యమైనవే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కాదు. వ్యక్తిగత జాతకం కోసం నిపుణులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story