November 2026 Horoscope: తులా, వృశ్చిక, ధనస్సు జాతకంలో భారీ మార్పులు
నవంబర్ 2026 రాశిఫలాలు తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, కుటుంబం, ఆరోగ్య విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
November 2026 Horoscope:నవంబర్ 2026లో గ్రహాల సంచారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారి జీవితాల్లో కొన్ని కీలక మార్పులకు కారణం కానుంది. గురు, శని గ్రహాల ప్రభావంతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాహు, కేతువుల ప్రభావం కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులను తీసుకురావచ్చు. ఈ మూడు రాశుల వారికి ఈ నెలలో గ్రహబలం ఎలా ఉంది? ఉద్యోగం, కుటుంబం, ప్రేమ, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
తులారాశి
తులా రాశి వారికి నవంబర్ నెల ప్రగతికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతాధికారుల సహకారం అందుతుంది. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాలు, వ్యూహాలతో లాభాలను పెంచుకోవచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉన్నత విద్య విషయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా ఆదాయం పెరగడంతో పాటు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు, విశ్రాంతిపై శ్రద్ధ పెట్టాలి.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి ఈ నెల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు అందవచ్చు. పనిభారం పెరిగినా సమర్థంగా పూర్తి చేసి గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం అందవచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు లాభాలను తెచ్చిపెట్టవచ్చు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్తు నిర్ణయాల విషయంలో గందరగోళానికి గురికాకుండా జాగ్రత్తపడాలి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, భవిష్యత్తు విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థికంగా ఆదాయం, పొదుపు మెరుగుపడతాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సురాశి
ధనుస్సు రాశి వారికి నవంబర్‌లో గురు గ్రహ అనుకూలతతో అదృష్టం కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో నెల ప్రారంభంలో బాధ్యతలు, ఒత్తిడి పెరగవచ్చు. ఉన్నతాధికారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలి. నెల ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడవచ్చు. వ్యాపారస్తులకు ప్రారంభంలో పోటీ ఎదురైనా మధ్యంతరం నుంచి లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోకుండా చదువుపై దృష్టి పెట్టాలి. కుటుంబంలో తండ్రి లేదా పెద్దలతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రేమ, వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన అవసరం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఒత్తిడి, నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకూడదు. తండ్రి ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలి.




