Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి మాట‌కారులు, మాట‌ల‌తో ఇట్టే ఆక‌ట్టుకుంటారు

Numerology: న్యూమ‌రాల‌జీలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, ఇతరులతో వ్యవహరించే తీరును పుట్టిన తేదీ ఆధారంగా అంచనా వేయవచ్చని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు.

Mokshith
Published on: 29 Sept 2026 8:12 PM IST
Numerology
X

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి మాట‌కారులు, మాట‌ల‌తో ఇట్టే ఆక‌ట్టుకుంటారు

Numerology: న్యూమ‌రాల‌జీలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, ఇతరులతో వ్యవహరించే తీరును పుట్టిన తేదీ ఆధారంగా అంచనా వేయవచ్చని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు. ఈ క్రమంలో 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారిని మూలాంకం 4 కింద పరిగణిస్తారు. మ‌రి వీరి స్వ‌భావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకత

ఏ నెలలో అయినా 4, 13, 22 లేదా 31వ తేదీన జన్మించిన వారి మూలాంకం 4గా లెక్కిస్తారు. సంఖ్యాశాస్త్రం విశ్వాసాల ప్రకారం ఈ సంఖ్యకు రాహువును అధిపతిగా భావిస్తారు. అందువల్ల మూలాంకం 4 వ్యక్తుల్లో సాధారణంగా భిన్నంగా ఆలోచించే స్వభావం, కొత్త కోణంలో విషయాలను చూసే ధోరణి ఉంటుందని చెబుతారు. తమ మనసులో ఉన్న ప్రతీ విషయాన్ని వెంటనే బయటకు చెప్పకుండా అవసరమైనంత మేరకు మాత్రమే వెల్లడించే స్వభావం కూడా వీరిలో కనిపిస్తుందని న్యూమరాలజీ చెబుతుంది. ఎదుటివారి మనస్తత్వాన్ని బట్టి సంభాషణను మార్చుకోవడం వీరికి బాగా తెలుసని నమ్ముతారు.

మాటలతో ఎదుటివారిని ఒప్పించే నేర్పు

మూలాంకం 4 వ్యక్తుల గురించి అంకశాస్త్రంలో ఎక్కువగా చెప్పే అంశాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యం ఒకటి. తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించడంతో పాటు, ఎదుటివారికి నచ్చే విధంగా విషయాన్ని చెప్పగలరని భావిస్తారు. ఒకే విషయాన్ని వ్యక్తి, పరిస్థితిని బట్టి వేర్వేరు విధాలుగా వివరించడం వీరి ప్రత్యేకతగా చెబుతారు. ఇదే కారణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని పూర్తిగా చెప్పకుండా మాటలను మార్చి చెప్పగలరనే అభిప్రాయం కూడా ఉంది. అయితే దీన్ని బట్టి మూలాంకం 4లో పుట్టిన ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెబుతారని అర్థం కాదు. పరిస్థితిని చక్కదిద్దడం, అనవసరమైన గొడవను నివారించడం వంటి కారణాలతో కొందరు నిజాన్ని దాచిపెట్టవచ్చని అంకశాస్త్ర విశ్లేషణలు చెబుతున్నాయి.

వ్యూహం వేసుకుని ముందుకు సాగుతారట

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని పరిణామాలను ఆలోచించడం మూలాంకం 4 వ్యక్తుల మరో లక్షణంగా న్యూమరాలజీలో పేర్కొంటారు. ఒక పని ఎలా మొదలుపెట్టాలి, మధ్యలో ఎలాంటి సమస్యలు రావచ్చు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ముందుగానే ఆలోచించేందుకు ఇష్టపడతారని చెబుతారు. తమకు ఉపయోగపడే సమాచారాన్ని వెంటనే అందరితో పంచుకోకుండా అవసరమైన సమయం వరకు గోప్యంగా ఉంచుతారని కూడా న్యూమ‌రాల‌జీ విశ్వాసాలు పేర్కొంటాయి. అందుకే వీరు కొన్నిసార్లు రహస్యంగా వ్యవహరిస్తున్నట్లు ఇతరులకు అనిపించవచ్చు. సమస్యలను నేరుగా ఎదుర్కొనే బదులు వ్యూహంతో పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తారని చెబుతారు.

అబ‌ద్ధాలు చెప్తారా.?

మూలాంకం 4కు సంబంధించిన ఈ లక్షణాలను కేవలం అబద్ధాలు చెప్పే స్వభావంగా చూడటం సరైనది కాదని న్యూమరాలజీ విశ్లేషకులు చెబుతారు. పరిస్థితిని బట్టి మాట్లాడటం, విషయాలను గోప్యంగా ఉంచడం, ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నం చేయడం వేర్వేరు అంశాలు. వీటిని బట్టి ఒక వ్యక్తి నిజాయితీని నిర్ణయించలేం.

అసలు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారనేది వారి పెంపకం, అనుభవాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పుట్టిన తేదీ ఆధారంగా ఎవరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా నిర్ణయించడం సాధ్యం కాదు. న్యూమ‌రాల‌జీలో చెప్పే ఈ విశ్లేషణలను కేవలం ఓ ఆచారంగానే భావించాలి. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని గుర్తించారు

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.