Daily Horoscope: అక్టోబర్ 2 రాశిఫలాలు - ఈ రాశుల వారికి నూతన అవకాశాలతో ఆర్థికంగా స్థిరత్వం
అక్టోబర్ 2 శుక్రవారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా షష్టి తిథి ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Daily Horoscope: అక్టోబర్ 2, శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు కొనసాగుతున్నాయి. భాద్రపద బహుళ షష్ఠి తిథి ఉదయం 10:15 గంటల వరకు ఉండి, ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మృగశీర్ష నక్షత్రం రాత్రి 2:55 గంటల వరకు కొనసాగి అనంతరం ఆరుద్ర నక్షత్రం వస్తుంది. సాయంత్రం 6:16 గంటల వరకు వ్యతీపాత యోగం, ఆ తర్వాత వరీయాన్ యోగం ఉంటుంది. ఉదయం 10:15 వరకు వణిజ కరణం, రాత్రి 9:06 వరకు విష్టి కరణం, అనంతరం బవ కరణం ఉంటుంది. ఈ పంచాంగ ప్రభావం నేపథ్యంలో ఈ రోజు ప్రతి రాశికి భిన్నమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పని విషయంలో పట్టుదల, డబ్బు విషయంలో నియంత్రణ, కుటుంబంలో సహనం పాటిస్తే ప్రతికూలతలను తగ్గించుకోవచ్చు. ఇక 12 రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు శ్రమకు తగిన ఫలితం కనిపించే రోజు. ఉద్యోగంలో మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా వినియోగిస్తే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలిస్తుంది.
వృషభరాశి
వృషభ రాశివారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు ఉండవచ్చు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
మిథునరాశి
మిథున రాశివారికి ఈ రోజు ఫలితాలు కలగలిపి ఉంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించినా, పనిభారం పెరగవచ్చు. వ్యాపారంలో క్రమశిక్షణ చాలా అవసరం. డబ్బు విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని తగ్గించడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
కర్కాటకరాశి
కర్కాటక రాశివారికి వృత్తిపరంగా ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ఇంట్లో చిన్న విషయాలు వివాదాలకు దారితీయకుండా మాటతీరు మార్చుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
సింహరాశి
సింహ రాశివారికి ఈ రోజు ఉత్సాహాన్ని ఇచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు లేదా హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే అవసరం లేని ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం వల్ల అనుబంధం మరింత బలపడుతుంది.
కన్యారాశి
కన్య రాశివారికి ఈ రోజు ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కవచ్చు. స్వయంకృషితో ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల సమాచారం అందవచ్చు. ఊహించని విధంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
తులారాశి
తుల రాశివారు ఈ రోజు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉన్నా, ఆకస్మిక ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబంలో చిన్న విషయాలను పెద్దవిగా చేయకుండా సంయమనంతో వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం.
వృశ్చికరాశి
వృశ్చిక రాశివారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ప్రయాణాలు అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు.
ధనుస్సురాశి
ధనుస్సు రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక కొంత అసహనం కలగవచ్చు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పరిస్థితులు అదుపులోకి వస్తాయి. ఆర్థికంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వైద్య సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
మకరరాశి
మకర రాశివారికి ఈ రోజు శుభపరిణామాలు కనిపిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా సరైన నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సందర్భాలు చోటుచేసుకుంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు.
కుంభరాశి
కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా లేకపోయినా, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే పనులను చక్కదిద్దుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక వ్యవహారాలకు ముందస్తు ప్రణాళిక అవసరం. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను వాయిదా వేయకండి.
మీనరాశి
మీన రాశివారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపుతట్టవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో అనుకూల ఫలితాలు అందుకోవచ్చు. ఇంటికి సంబంధించిన ఒక శుభవార్త కుటుంబ సభ్యులందరిలో ఆనందాన్ని నింపుతుంది. విహారయాత్రలు లేదా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




