October 2026 Horoscope: అక్టోబర్ రాశిఫలాలు - దసరా తరువాత అదృష్టం మారనున్న రాశులు ఇవే
దసరా తర్వాత గ్రహాల ప్రభావంతో 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, విద్య, ఆరోగ్యం, ప్రేమ, వివాహ విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి.
October 2026 Horoscope: అక్టోబర్ 2026లో గ్రహాల సంచారం అన్ని రాశులపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపించదు. కొందరికి కెరీర్‌లో కొత్త దారులు కనిపిస్తే.. మరికొందరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని రాశులకు కుటుంబ సంబంధాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత నిర్ణయాలు ప్రధానంగా మారతాయి. ముఖ్యంగా రాహు, కేతు, శని, గురు గ్రహాల స్థానాలు ఈ నెలలో రాశుల జీవితాల్లో కీలకమైన మార్పులకు కారణమయ్యే సూచనలు ఇస్తున్నాయి.
మేషరాశి
మేష రాశివారికి అక్టోబర్ నెల పూర్తిగా సాఫీగా ఉండదు. ఆశయాలు పెరిగినా వాటిని ఆచరణలో పెట్టేందుకు అదనపు శ్రమ అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. ఆర్థికంగా కుటుంబ అవసరాలు, అనుకోని ఖర్చులు ఒత్తిడి కలిగించవచ్చు. ప్రేమ, దాంపత్య విషయాల్లో మాటతీరు చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. ధ్యానం, ఆధ్యాత్మిక సాధన మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.
వృషభరాశి
వృషభ రాశికి అక్టోబర్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ప్రమోషన్‌కు సంబంధించిన పరిణామాలు రావచ్చు. వ్యాపారులకు విస్తరణకు అవకాశం ఉంటుంది. విదేశీ ఉద్యోగాలు లేదా విదేశీ సంబంధిత అవకాశాలు కూడా కలిసిరావచ్చు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఉంటాయి. ప్రేమ, దాంపత్య జీవితం స్థిరంగా సాగుతుంది. క్రమశిక్షణతో యోగా, వ్యాయామం చేస్తే ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.
మిథునరాశి
మిథున రాశివారికి డబ్బు విషయంలో స్థిరత్వం పెరిగే సమయం. పొదుపు, పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు రావచ్చు. వ్యాపారులకు విస్తరణ అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో అనుబంధం బలపడుతుంది. అయితే చిన్నపాటి అలర్జీలు, జలుబు లేదా కాళ్లకు సంబంధించిన ఇబ్బందులను నిర్లక్ష్యం చేయకండి.
కర్కాటకరాశి
కర్కాటక రాశికి ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. స్వీయ విశ్వాసం పెరుగుతుంది కానీ ఉద్యోగంలో అసంతృప్తి కలగవచ్చు. మార్పు గురించి ఆలోచించే పరిస్థితులు రావచ్చు. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న అపార్థాలు ఏర్పడకుండా సహనం అవసరం. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. జీర్ణ సంబంధ సమస్యలపై శ్రద్ధ పెట్టాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం.
సింహరాశి
సింహ రాశివారు అక్టోబర్‌లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన స్థాయిలో వేగం కనిపించకపోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత పరీక్షగా మారుతుంది. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రేమ, దాంపత్యంలో స్పష్టమైన సంభాషణ అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి. మరోవైపు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగడం మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది.
కన్యారాశి
కన్య రాశివారికి పోటీ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అనుకూల సంకేతాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రేమ, కుటుంబ జీవితంలో అనుబంధం బలపడుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశం ఉంది. నిద్ర, జీర్ణక్రియ విషయంలో జాగ్రత్త అవసరం. దుర్గాదేవి ఆరాధన మానసిక బలాన్ని పెంచుతుంది.
తులారాశి
తుల రాశివారికి కెరీర్, విద్య పరంగా అక్టోబర్ మంచి అవకాశాలను చూపిస్తోంది. ఉద్యోగంలో పురోగతి, కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. విదేశీ విద్యకు ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు కలిసిరావచ్చు. కుటుంబ జీవితం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. అయితే పిల్లలు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందే పరిస్థితులు రావచ్చు. ఆర్థికంగా పెద్ద పెట్టుబడుల్లో తొందరపడకపోవడం మంచిది.
వృశ్చికరాశి
వృశ్చిక రాశివారికి కెరీర్‌లో కొంత ఒత్తిడి ఉన్నా విద్య, కుటుంబ విషయాల్లో ఉపశమనం ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు. వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. గురు ప్రభావంతో చదువులో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఆస్తి లేదా ఇతర విషయాలపై చిన్నపాటి చర్చలు రావచ్చు. ప్రేమ, వివాహ విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
ధనుస్సురాశి
ధనుస్సు రాశివారు ఈ నెల ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో ఆలస్యం, పనిభారం లేదా నిరాశ ఎదురవచ్చు. వ్యాపారులకు లాభాలు ఆశించినంతగా లేకపోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. కుటుంబంలో ముఖ్యంగా తండ్రితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఖర్చులు పెరగవచ్చు. విదేశీ సంబంధాల ద్వారా కొన్ని అవకాశాలు రావచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
మకరరాశి
మకర రాశివారికి నెల మొత్తం పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు, బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదురైనా పోటీ పరీక్షల్లో ముందుకు సాగవచ్చు. కుటుంబంలో అప్పుడప్పుడు వాదనలు వచ్చినా పరిస్థితి అదుపులో ఉంటుంది. ప్రేమ, వివాహ విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఆదాయం మెరుగుపడి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఓర్పుతో పనిచేస్తే నెల చివరికి మంచి స్పష్టత వస్తుంది.
కుంభరాశి
కుంభ రాశివారికి అక్టోబర్ కొంత సవాళ్లతో కూడుకున్న కాలం. ఉద్యోగంలో ఒత్తిడి, గుర్తింపు ఆలస్యం కావచ్చు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రమబద్ధంగా చదవాలి. కుటుంబంలో మాటపట్టింపులు రావచ్చు. ప్రేమ, దాంపత్యంలో భావోద్వేగ దూరం ఏర్పడకుండా పరస్పరం మాట్లాడుకోవాలి. డబ్బు విషయంలో పొదుపు ముఖ్యం. ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవాలి.
మీనరాశి
మీన రాశివారికి అక్టోబర్‌లో బాధ్యతలు, పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆలస్యాలు వచ్చినా క్రమశిక్షణతో ముందుకు సాగాలి. వ్యాపారులు పోటీ కారణంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు ప్రారంభంలో ఏకాగ్రత సమస్యలు ఉన్నా క్రమంగా పురోగతి సాధ్యమవుతుంది. కుటుంబంలో అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడటం అవసరం. ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులను నియంత్రించాలి. యోగా, ధ్యానం, ఇష్టదైవ ఆరాధన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.
గమనికః ఇక్కడ ఇచ్చిన అక్టోబర్ మాసం రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.




